Seppinattallaa mari sesudagaaga

చెప్పినట్టల్లా మరి చేసుటగాక
Language

(॥పల్లవి॥)
చెప్పినట్టల్లా మరి చేసుటగాక
దప్పిదేరి లోలోనే తలవంచ నేఁటికీ

(॥॥)
సిగ్గులు వడేవారికి చింతఁ బొరలే వారికి
యెగ్గులు పట్టఁగఁ జెల్లు నెంతైనను
అగ్గలమై పతిమీఁది యాసకు లోనైనవారు
తగ్గు మొగ్గు వాసులలోఁ దడఁబడ నేఁటికి

(॥॥)
పంతము లాడేవారికి భావించుకొనేవారికి
వింతగా జరయఁ దగు వేమారును
చెంతనుండి రతులలోఁ జెలిమి సేసేవారు
మంతనాన వట్టి యనుమానము లేఁటికీ

(॥॥)
చలపాదివారికి జడియనివారికి
కిలకిల నవ్వవచ్చుఁ గేరడానను
యెలమి శ్రీ వేంకటేశుఁడే నలమేలుమంగను
కలసె నన్నితఁడు కక్కసించ నేఁటికీ

(||pallavi||)
sĕppinaṭṭallā mari sesuḍagāga
dappideri lolone talavaṁcha nem̐ṭigī

(||||)
siggulu vaḍevārigi siṁtam̐ bŏrale vārigi
yĕggulu paṭṭam̐gam̐ jĕllu nĕṁtainanu
aggalamai padimīm̐di yāsagu lonainavāru
taggu mŏggu vāsulalom̐ daḍam̐baḍa nem̐ṭigi

(||||)
paṁtamu lāḍevārigi bhāviṁchugŏnevārigi
viṁtagā jarayam̐ dagu vemārunu
sĕṁtanuṁḍi radulalom̐ jĕlimi sesevāru
maṁtanāna vaṭṭi yanumānamu lem̐ṭigī

(||||)
salabādivārigi jaḍiyanivārigi
kilagila navvavachchum̐ geraḍānanu
yĕlami śhrī veṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
kalasĕ nannidam̐ḍu kakkasiṁcha nem̐ṭigī