చెప్పినట్లానె సేసి చిత్తము పట్టుదు గాక
(॥పల్లవి॥)
చెప్పినట్లానె సేసి చిత్తము పట్టుదు గాక
తప్పు లెంచఁ గలనా తగులైన దానను
(॥॥)
నీ మోము చూచి చూచి నిన్ను నెట్టు దూరుదు
కామించి నీ రాకకు నేఁ కరేదానను
ఆముకొని నా బొమ్మల నప్పటి నెట్టు జంకింతు
గామిడి నీ పంగెనపు కౌఁగిటిలో దానను
(॥॥)
సారె నీతో నవ్వి నవ్వి జరసి యెట్ట లుగుదు
కోరి యాసపడి కాచుకున్న దానను
మేర మీఱి యెట్టు మందెమేళముతోఁ బెనఁగుదు
వూరక నీ మొగమోట నుండేటి దానను
(॥॥)
గరిమ నీ వద్ద నుండి కన్నుల నెట్టదలింతు
మరిగి వలచిన నేమపుదానను
యిరవై శ్రీ వేంకటేశ యిట్టే నన్నుఁ గూడితివి
గరిసింతునా నే నీ కరుణలో దానను
(||pallavi||)
sĕppinaṭlānĕ sesi sittamu paṭṭudu gāga
tappu lĕṁcham̐ galanā tagulaina dānanu
(||||)
nī momu sūsi sūsi ninnu nĕṭṭu dūrudu
kāmiṁchi nī rāgagu nem̐ karedānanu
āmugŏni nā bŏmmala nappaḍi nĕṭṭu jaṁkiṁtu
gāmiḍi nī paṁgĕnabu kaum̐giḍilo dānanu
(||||)
sārĕ nīdo navvi navvi jarasi yĕṭṭa lugudu
kori yāsabaḍi kāsugunna dānanu
mera mīṟi yĕṭṭu maṁdĕmeḽamudom̐ bĕnam̐gudu
vūraga nī mŏgamoḍa nuṁḍeḍi dānanu
(||||)
garima nī vadda nuṁḍi kannula nĕṭṭadaliṁtu
marigi valasina nemabudānanu
yiravai śhrī veṁkaḍeśha yiṭṭe nannum̐ gūḍidivi
garisiṁtunā ne nī karuṇalo dānanu