చెప్పినంత పని నేఁ జేయగలవాఁడ నింతే
(॥పల్లవి॥)
చెప్పినంత పని నేఁ జేయగలవాఁడ నింతే
అప్పటి నపరాధమా ఆదరించవలదా
(॥చెప్పి॥)
నీయాజ్ఞ దేహము నే మోచితినింతే
యీయెడ విజ్ఞానమేల యియ్యవయ్యా
వేయి వేలై వేగుదాఁక వెట్టిసేసి యలసితి
వోయయ్య కొంతైన వూరడించవలదా
(॥చెప్పి॥)
నీవు సేసేకర్మము నేఁజేయువాఁడ నింతే
యీవల నానందసుఖ మియ్యవయ్యా
కోవరమై వెంట వెంటఁ గొలిచినబంట్లకు
తావులఁ గొంత వడైనా దప్పిదీర్చవలదా
(॥చెప్పి॥)
మతిలో శ్రీవేంకటేశ మనికయినవాఁడ నింతే
తతి నాపాటుకు దయదలఁచవయ్య
యితవై పనిసేసేటి యింటి పసురమునకు
వెతదీరఁ బాలార్చి వెడ్డు వెట్టఁదగదా
(||pallavi||)
sĕppinaṁta pani nem̐ jeyagalavām̐ḍa niṁte
appaḍi nabarādhamā ādariṁchavaladā
(||sĕppi||)
nīyājña dehamu ne mosidiniṁte
yīyĕḍa vijñānamela yiyyavayyā
veyi velai vegudām̐ka vĕṭṭisesi yalasidi
voyayya kŏṁtaina vūraḍiṁchavaladā
(||sĕppi||)
nīvu sesegarmamu nem̐jeyuvām̐ḍa niṁte
yīvala nānaṁdasukha miyyavayyā
kovaramai vĕṁṭa vĕṁṭam̐ gŏlisinabaṁṭlagu
tāvulam̐ gŏṁta vaḍainā dappidīrsavaladā
(||sĕppi||)
madilo śhrīveṁkaḍeśha manigayinavām̐ḍa niṁte
tadi nābāḍugu dayadalam̐savayya
yidavai paniseseḍi yiṁṭi pasuramunagu
vĕdadīram̐ bālārsi vĕḍḍu vĕṭṭam̐dagadā