Seppina naa buddi neegum jevim battadaa

చెప్పిన నా బుద్ది నీకుఁ జెవిఁ బట్టదా
Language

(॥పల్లవి॥)
చెప్పిన నా బుద్ది నీకుఁ జెవిఁ బట్టదా
వుప్పతించ నంతవద్దు వూరకైనా నతని

(॥చెప॥)
పిలిచితే రాఁగదవే ప్రియునికి నీవు
చలము సాదించవద్దు సారెసారెకు
వలెనంటే నియ్యరాదా వరుసతో విడెము
మలకలఁ బెట్టవద్దు మాపుదాఁకా సొలసి

(॥చెప॥)
నగితే నవ్వఁగదవే ననుపు చేసుకతని
వెగటున మీరవద్దు వేసాలకు
తగిలితేఁ గూడరాదా తమకించి కాఁగిటను
ఆగడులు సేయవద్దు ఆఱడితో నిపుడు

(॥చెప॥)
చెప్పినట్లు సేయఁగదే శ్రీ వేంకటేశుఁడితఁడు
తప్పులు మోపవద్దు తచ్చనతోడ
యిప్పుడే యితఁడు నిన్ను నెనసె నిందరిలోన
చొప్పులు వెదకవద్దు సొరిది బింకానను

(||pallavi||)
sĕppina nā buddi nīgum̐ jĕvim̐ baṭṭadā
vuppadiṁcha naṁtavaddu vūragainā nadani

(||sĕba||)
piliside rām̐gadave priyunigi nīvu
salamu sādiṁchavaddu sārĕsārĕgu
valĕnaṁṭe niyyarādā varusado viḍĕmu
malagalam̐ bĕṭṭavaddu mābudām̐kā sŏlasi

(||sĕba||)
nagide navvam̐gadave nanubu sesugadani
vĕgaḍuna mīravaddu vesālagu
tagilidem̐ gūḍarādā tamagiṁchi kām̐giḍanu
āgaḍulu seyavaddu āṟaḍido nibuḍu

(||sĕba||)
sĕppinaṭlu seyam̐gade śhrī veṁkaḍeśhum̐ḍidam̐ḍu
tappulu mobavaddu tachchanadoḍa
yippuḍe yidam̐ḍu ninnu nĕnasĕ niṁdarilona
sŏppulu vĕdagavaddu sŏridi biṁkānanu