చెప్పితినేఁ దొలుతనే చెలులు సాకిరిగాఁగ
(॥పల్లవి॥)
చెప్పితినేఁ దొలుతనే చెలులు సాకిరిగాఁగ
తప్పు లేదు నావల్లఁ దలఁచుకోరా
(॥॥)
జక్కవ చన్నులు నీవు సారెఁ బట్టకురా
పక్కనను నీవురముపై కెగరీని
వుక్కుగోరిదాన నన్ను నొరసి చూడకురా
చెక్కు లేడ సోఁకినాను జీరవారీని
(॥॥)
తుమ్మెద రెక్కల కొప్పు దువ్వ నీవు రాకురా
జుమ్మన రేఁగీని మైఁ జుట్టు కొనీని
తమ్మె కన్నుల నా చూప దార దడవకురా
నమ్మి పొందు సేసితేను నాఁ టుకొనీని
(॥॥)
మోవి పంటి తేనెకు ముంచి నోరూరకురా
నా వాఁడవైనా నీకు నాము లెక్కీని
యీ వేళ శ్రీ వేంకటేశ యెనసితి విటు నన్ను
భావించి చూచుకొంటేను పచ్చిదేరీని
(||pallavi||)
sĕppidinem̐ dŏludane sĕlulu sāgirigām̐ga
tappu ledu nāvallam̐ dalam̐sugorā
(||||)
jakkava sannulu nīvu sārĕm̐ baṭṭagurā
pakkananu nīvuramubai kĕgarīni
vukkugoridāna nannu nŏrasi sūḍagurā
sĕkku leḍa som̐kinānu jīravārīni
(||||)
tummĕda rĕkkala kŏppu duvva nīvu rāgurā
jummana rem̐gīni maim̐ juṭṭu kŏnīni
tammĕ kannula nā sūba dāra daḍavagurā
nammi pŏṁdu sesidenu nām̐ ṭugŏnīni
(||||)
movi paṁṭi tenĕgu muṁchi norūragurā
nā vām̐ḍavainā nīgu nāmu lĕkkīni
yī veḽa śhrī veṁkaḍeśha yĕnasidi viḍu nannu
bhāviṁchi sūsugŏṁṭenu pachchiderīni