చెప్పితిఁ జుమ్మీ నీకు చెలికత్తె నే నాపెకు
(॥పల్లవి॥)
చెప్పితిఁ జుమ్మీ నీకు చెలికత్తె నే నాపెకు
యెప్పుడూను మఱవకు యీగురుతు లిపుడు
(॥చెప్పి॥)
చేరఁడేసి కన్నులాపె సెలవుల నవ్వులాపె
మూరెఁడు గొప్పాపె నీకు మొక్కితే ననె
తోరపుఁ బిరుఁదులాపె తొండపుఁ దొడలయాపె
తారుకాణలైపొందు దలఁచుకొమ్మనెను
(॥చెప్పి॥)
పట్టెఁడేసి గుబ్బలాపె పలచని మోవియాపె
అట్టె నీపరిణామ మడుగుమనె
జుట్టెఁ డేశడుగులాపె సోయగపుఁ జేతులాపె
చుట్టరికపు వావు లెంచుకొమ్మనె నిన్నును
(॥చెప్పి॥)
కొడిఁగెఁడు మొగమాపె కోమలపు మేనియాపె
అడరి నీవు తన్నుఁ బెండ్లాడితివనె
పిడికెడు నడుమాపె పెనఁగి శ్రీవేంకటేశ
యెడయక ఇట్టానె యేలుకొమ్మనెను
(||pallavi||)
sĕppidim̐ jummī nīgu sĕligattĕ ne nābĕgu
yĕppuḍūnu maṟavagu yīgurudu libuḍu
(||sĕppi||)
seram̐ḍesi kannulābĕ sĕlavula navvulābĕ
mūrĕm̐ḍu gŏppābĕ nīgu mŏkkide nanĕ
torabum̐ birum̐dulābĕ tŏṁḍabum̐ dŏḍalayābĕ
tārugāṇalaibŏṁdu dalam̐sugŏmmanĕnu
(||sĕppi||)
paṭṭĕm̐ḍesi gubbalābĕ palasani moviyābĕ
aṭṭĕ nībariṇāma maḍugumanĕ
juṭṭĕm̐ ḍeśhaḍugulābĕ soyagabum̐ jedulābĕ
suṭṭarigabu vāvu lĕṁchugŏmmanĕ ninnunu
(||sĕppi||)
kŏḍim̐gĕm̐ḍu mŏgamābĕ komalabu meniyābĕ
aḍari nīvu tannum̐ bĕṁḍlāḍidivanĕ
piḍigĕḍu naḍumābĕ pĕnam̐gi śhrīveṁkaḍeśha
yĕḍayaga iṭṭānĕ yelugŏmmanĕnu