Seppidim jeppidini maadom jelladu nee kimkanu

చెప్పితిఁ జెప్పితిని మాతోఁ జెల్లదు నీ కింకను
Language

(॥పల్లవి॥)
చెప్పితిఁ జెప్పితిని మాతోఁ జెల్లదు నీ కింకను
ముప్పిరి నున్నది ముందర నిదివో ముసళ్ళపండుగరా

(॥చెపతి॥)
అంతేసి నవ్వకురా వోరి అదె నిజమయ్యీని గొల్ల
దొంతులవావులదోమటి దొడుక దోసము నీ కేలరా
యింతుకు నే నోపను నీకు యిచ్చకాలు నేరరా
కంతుని దీమపు కంచుఁ బదనులకామిని నింతేరా

(॥చెపతి॥)
కాఁకలు సేయకురా కైతప్పు లే మవునో
పోఁకకుఁ బుట్టెఁ డు యెక్కడ చూచిన పొల తులమోహము
వేఁకపుజవ్వనిని నీ వేసాలు మోసాలురా
మాఁకులమీఁదట ననలవాఁడికి మారుమలతుమురా

(॥చెపతి॥)
కడు బిగించకురా నీ కందున కౌఁగిటను
వెడగు నాకుచగిరులు నీకును వీఁపున వెడలురా
తడిసెఁజెమటలా మనతనువు లిద్దరికి
తడవిడిచితి శ్రీవేంకటేశ్వర దక్కితి నే నీకురా

(||pallavi||)
sĕppidim̐ jĕppidini mādom̐ jĕlladu nī kiṁkanu
muppiri nunnadi muṁdara nidivo musaḽḽabaṁḍugarā

(||sĕbadi||)
aṁtesi navvagurā vori adĕ nijamayyīni gŏlla
dŏṁtulavāvuladomaḍi dŏḍuga dosamu nī kelarā
yiṁtugu ne nobanu nīgu yichchagālu nerarā
kaṁtuni dīmabu kaṁchum̐ badanulagāmini niṁterā

(||sĕbadi||)
kām̐kalu seyagurā kaidappu le mavuno
pom̐kagum̐ buṭṭĕm̐ ḍu yĕkkaḍa sūsina pŏla tulamohamu
vem̐kabujavvanini nī vesālu mosālurā
mām̐kulamīm̐daḍa nanalavām̐ḍigi mārumaladumurā

(||sĕbadi||)
kaḍu bigiṁchagurā nī kaṁduna kaum̐giḍanu
vĕḍagu nāgusagirulu nīgunu vīm̐puna vĕḍalurā
taḍisĕm̐jĕmaḍalā manadanuvu liddarigi
taḍaviḍisidi śhrīveṁkaḍeśhvara dakkidi ne nīgurā