చెప్పితి నీచిత్తము చెలిభాగ్య మిఁకను
(॥పల్లవి॥)
చెప్పితి నీచిత్తము చెలిభాగ్య మిఁకను
తప్పదు కలిగినది దాఁచ నీకు నేను
(॥చెప్పి॥)
వెలఁది యిప్పుడు నీవేళ చూచి రమ్మనె
తలఁపు నీకెట్టున్నదో తెలియుమనె
కలపుకోలుగాఁ దనకానుకిచ్చి రమ్మనె
పిలిచి తెమ్మనె నింతి ప్రేమ దాఁచనేఁటికి
(॥చెప్పి॥)
తనతో నీవన్నమాట తలఁపించి రమ్మనె
వినయములెల్లాఁజేసి వేఁడుకొమ్మనె
మునుపనె తనమారు మొక్కులు మొక్కుమనె
తనుఁజూడ రమ్మనె దాఁచ నిఁకనేఁటికి
(॥చెప్పి॥)
ఇంతలో నీరాకకు నెదురుకొనీ(నే?) రమ్మనె
చెంత నీవేలితివి మెచ్చితి నిన్ననె
అంతటి శ్రీ వేంకటేశ యలమేలుమంగ యీకె
మంతనాన గూడితిరి మఱి దాఁచనేఁటికి
(||pallavi||)
sĕppidi nīsittamu sĕlibhāgya mim̐kanu
tappadu kaliginadi dām̐sa nīgu nenu
(||sĕppi||)
vĕlam̐di yippuḍu nīveḽa sūsi rammanĕ
talam̐pu nīgĕṭṭunnado tĕliyumanĕ
kalabugolugām̐ danagānugichchi rammanĕ
pilisi tĕmmanĕ niṁti prema dām̐sanem̐ṭigi
(||sĕppi||)
tanado nīvannamāḍa talam̐piṁchi rammanĕ
vinayamulĕllām̐jesi vem̐ḍugŏmmanĕ
munubanĕ tanamāru mŏkkulu mŏkkumanĕ
tanum̐jūḍa rammanĕ dām̐sa nim̐kanem̐ṭigi
(||sĕppi||)
iṁtalo nīrāgagu nĕdurugŏnī(ne?) rammanĕ
sĕṁta nīvelidivi mĕchchidi ninnanĕ
aṁtaḍi śhrī veṁkaḍeśha yalamelumaṁga yīgĕ
maṁtanāna gūḍidiri maṟi dām̐sanem̐ṭigi