Seppidi mippude neegu selulamu buddulellaa

చెప్పితి మిప్పుడే నీకు చెలులము బుద్దులెల్లా
Language

(॥పల్లవి॥)
చెప్పితి మిప్పుడే నీకు చెలులము బుద్దులెల్లా
వొప్పుగొని తగినట్టు వూహించుకొనవే

(॥చెప్ప॥)
పందేలు వేసేవేమే బలువునితో
అందుకు నీవొడితేనే అలవయ్యేవా
అంది సాములు చేసేవే యాతనితోను
కిందఁ జిక్కితే మోవివిందు వెట్టేవా

(॥చెప్ప॥)
సంగడిఁ గూచుండేవేమే సరసునితో
యెంగిలి మోవెంటించితే నియ్యకొనేవా
ముంగిటికి వచ్చేనంటా మొక్కేవే నీవు
చంగనఁ గాఁగిలించితే సమ్మతించేవా

(॥చెప్ప॥)
వీడెమిచ్చేవేమే శ్రీవేంకటేశుకు
యీడుగాఁ గూడితేను యిచ్చగించేవా
యీడనే యలమేల్‌మంగ యిరవైతివే
వాడిక నీవాతనివలపు చేకొనేవా

(||pallavi||)
sĕppidi mippuḍe nīgu sĕlulamu buddulĕllā
vŏppugŏni taginaṭṭu vūhiṁchugŏnave

(||sĕppa||)
paṁdelu veseveme baluvunido
aṁdugu nīvŏḍidene alavayyevā
aṁdi sāmulu seseve yādanidonu
kiṁdam̐ jikkide moviviṁdu vĕṭṭevā

(||sĕppa||)
saṁgaḍim̐ gūsuṁḍeveme sarasunido
yĕṁgili movĕṁṭiṁchide niyyagŏnevā
muṁgiḍigi vachchenaṁṭā mŏkkeve nīvu
saṁganam̐ gām̐giliṁchide sammadiṁchevā

(||sĕppa||)
vīḍĕmichcheveme śhrīveṁkaḍeśhugu
yīḍugām̐ gūḍidenu yichchagiṁchevā
yīḍane yalamel‌maṁga yiravaidive
vāḍiga nīvādanivalabu segŏnevā