చెప్పితి మిప్పుడే నీకు చెలులము బుద్దులెల్లా
(॥పల్లవి॥)
చెప్పితి మిప్పుడే నీకు చెలులము బుద్దులెల్లా
ముప్పిరిఁ జేత మొక్కవే వెూసపోతిననక
(॥॥)
మనసార నాతనితో మాటలెల్లా నాడవే
చెనకవే ఇప్పుడేల సిగ్గువడేవు
పెనఁగవే చేయివట్టి పిలువవే యింటికి
వెనక మరచివచ్చి విచారము సేయక
(॥॥)
తలయెత్తి చూడవే తనియ నాతనిదిక్కు
నిలువనే ముందటను నీకేల కొంక
వెలయఁగ నవ్వవే విడెము చేతి కివ్వవే
మలసి యింకొకమారు మరచితిననక
(॥॥)
పానుపుపై గూచుండవే పాదాలోత్తఁ గదవే
మౌనముతో నిఁకఁ దెఱమఱఁ గేఁటికి
పూని శ్రీ వేంకటేశుడు పొందుసేసి నిన్నుఁ గూడె
కానుక మోవి చేకోవే కడమాయననక
(||pallavi||)
sĕppidi mippuḍe nīgu sĕlulamu buddulĕllā
muppirim̐ jeda mŏkkave vĕూsabodinanaga
(||||)
manasāra nādanido māḍalĕllā nāḍave
sĕnagave ippuḍela sigguvaḍevu
pĕnam̐gave seyivaṭṭi piluvave yiṁṭigi
vĕnaga marasivachchi visāramu seyaga
(||||)
talayĕtti sūḍave taniya nādanidikku
niluvane muṁdaḍanu nīgela kŏṁka
vĕlayam̐ga navvave viḍĕmu sedi kivvave
malasi yiṁkŏgamāru marasidinanaga
(||||)
pānububai gūsuṁḍave pādālottam̐ gadave
maunamudo nim̐kam̐ dĕṟamaṟam̐ gem̐ṭigi
pūni śhrī veṁkaḍeśhuḍu pŏṁdusesi ninnum̐ gūḍĕ
kānuga movi segove kaḍamāyananaga