చెప్పితి మిప్పుడే ఆకె సిగ్గువడును
(॥పల్లవి॥)
చెప్పితి మిప్పుడే ఆకె సిగ్గువడును
యెప్పుడు నేర్పరి వౌదు విన్నిటాను నీవూ
(॥॥)
చక్కఁ గా మగువపై సేసలు చల్లుదువు గాని
చెక్కు నొక్కేవు సుమ్మీ సిగ్గువడును
పిక్కటిల్లు చన్నుల పెండ్లికూఁతురు యీకె
కక్కసించేవు సుమ్మీ కడుఁ బువ్వువంటిది
(॥॥)
కాతరించక రమణీఁ గాలు దొక్కుదువు గాని
చేతులు వట్టే వు సుమ్మీ సిగ్గువడును
నీ తరుణి బారెఁ డేసి నెరుల కొప్పుది యీకె
గాత చూపేవు సుమ్మీ బంగారు బొమ్మవంటిది
(॥॥)
యెలమి శ్రీ వేంకటేశ యింతి నేలుదువు గాని
సెలవి నవ్వేవు సుమ్మీ సిగ్గు వడును
మొలనూళ్ళ బంగారు గంటల పిఱుఁదుల దీకె
అలయించేవు సుమ్మీ తలిరాకు వంటిది
(||pallavi||)
sĕppidi mippuḍe āgĕ sigguvaḍunu
yĕppuḍu nerbari vaudu vinniḍānu nīvū
(||||)
sakkam̐ gā maguvabai sesalu salluduvu gāni
sĕkku nŏkkevu summī sigguvaḍunu
pikkaḍillu sannula pĕṁḍligūm̐turu yīgĕ
kakkasiṁchevu summī kaḍum̐ buvvuvaṁṭidi
(||||)
kādariṁchaga ramaṇīm̐ gālu dŏkkuduvu gāni
sedulu vaṭṭe vu summī sigguvaḍunu
nī taruṇi bārĕm̐ ḍesi nĕrula kŏppudi yīgĕ
gāda sūbevu summī baṁgāru bŏmmavaṁṭidi
(||||)
yĕlami śhrī veṁkaḍeśha yiṁti neluduvu gāni
sĕlavi navvevu summī siggu vaḍunu
mŏlanūḽḽa baṁgāru gaṁṭala piṟum̐dula dīgĕ
alayiṁchevu summī talirāgu vaṁṭidi