చెప్పితి మా సాజము చెనకకు మమ్మును
(॥పల్లవి॥)
చెప్పితి మా సాజము చెనకకు మమ్మును
కప్పిన పయ్యదవల్ల గరగీ నా మనసు
(॥చెప్పి॥)
యేపున బ్రియము చెప్పే వేల చేయివట్టేవు
మాపుదాకా మావల్ల మంకుఁదనాలే
తీపులు మామోవి నింతే తేనెలు మామాట లింతే
దాపుగా నీకిందువల్ల దనిసీ నామనసు
(॥చెప్పి॥)
వొడివట్ట నేమిటికి వూరకే నవ్వనేఁటికి
కడలేనిమాచూపులు కడువాండ్లే
విడియాలు మాచేతివి వేసాలు మాగుణాలు
నడుమనే ఇందువల్ల నమ్మీ నామనసు
(॥చెప్పి॥)
గక్కున గూడితి విట్టె కప్పురము చల్లేవు
యెక్కువైనమాచన్ను లివి గట్లే
మొక్కులు మాచేతులవి మొరఁగులు సిగ్గులవి
ఇక్కువ శ్రీవేంకటేశ యెరిఁగీ నామనసు
(||pallavi||)
sĕppidi mā sājamu sĕnagagu mammunu
kappina payyadavalla garagī nā manasu
(||sĕppi||)
yebuna briyamu sĕppe vela seyivaṭṭevu
mābudāgā māvalla maṁkum̐danāle
tībulu māmovi niṁte tenĕlu māmāḍa liṁte
dābugā nīgiṁduvalla danisī nāmanasu
(||sĕppi||)
vŏḍivaṭṭa nemiḍigi vūrage navvanem̐ṭigi
kaḍalenimāsūbulu kaḍuvāṁḍle
viḍiyālu māsedivi vesālu māguṇālu
naḍumane iṁduvalla nammī nāmanasu
(||sĕppi||)
gakkuna gūḍidi viṭṭĕ kappuramu sallevu
yĕkkuvainamāsannu livi gaṭle
mŏkkulu māsedulavi mŏram̐gulu siggulavi
ikkuva śhrīveṁkaḍeśha yĕrim̐gī nāmanasu