Seppidi buddulu neegu selimigattem ganaga

చెప్పితి బుద్దులు నీకు చెలిమికత్తెఁ గనక
Language

(॥పల్లవి॥)
చెప్పితి బుద్దులు నీకు చెలిమికత్తెఁ గనక
యెప్పుడూ బాయకుండవే యెంత వేఁడుకొనేవు

(॥చెప్పి॥)
మంతనము లే మాడేవే మచ్చికఁ జెలులతోను
దొంతర నవ్వు లెంత తూరుపెత్తేవే
అంత వేడుకైతే బతియండఁ గూచుందువు రావే
ఇంతేసి యడియాసల నేల పొరలేవు

(॥చెప్పి॥)
తిలకిం చేమి చూచేవే తెరమరఁగుననుండి
వులివచ్చి సిగ్గుల నే లుమ్మగిలేవే
తలఁ పీతనిపైనుంటే తగిలి పొందుసేయవే
నిలువు నివ్వెరగుల నీ వేల యలసేవు

(॥చెప్పి॥)
మక్కువలేమి చూపేనే మాఁటలలోనే నీవు
చొక్కపు నయాల నేమి చొప్పు వేసేవే
దక్కి శ్రీవేంకటేశుఁడు తానే వచ్చి నిన్ను నేలె
అక్కరైతేఁ జెనకవే అదేల కొంకేవు

(||pallavi||)
sĕppidi buddulu nīgu sĕlimigattĕm̐ ganaga
yĕppuḍū bāyaguṁḍave yĕṁta vem̐ḍugŏnevu

(||sĕppi||)
maṁtanamu le māḍeve machchigam̐ jĕluladonu
dŏṁtara navvu lĕṁta tūrubĕtteve
aṁta veḍugaide badiyaṁḍam̐ gūsuṁduvu rāve
iṁtesi yaḍiyāsala nela pŏralevu

(||sĕppi||)
tilagiṁ semi sūseve tĕramaram̐gunanuṁḍi
vulivachchi siggula ne lummagileve
talam̐ pīdanibainuṁṭe tagili pŏṁduseyave
niluvu nivvĕragula nī vela yalasevu

(||sĕppi||)
makkuvalemi sūbene mām̐ṭalalone nīvu
sŏkkabu nayāla nemi sŏppu veseve
dakki śhrīveṁkaḍeśhum̐ḍu tāne vachchi ninnu nelĕ
akkaraidem̐ jĕnagave adela kŏṁkevu