చెప్పితి బద్దులు నేను చెలియ నీకు
(॥పల్లవి॥)
చెప్పితి బద్దులు నేను చెలియ నీకు
యెప్పడూ మఱవకువే యెడయదు మనసు
(॥చెప్పి॥)
పంతమాడవచ్చునా పడఁతికి మగనితో
చెంతనుండి యిచ్చకమే సేయుటగాక
యెంత గోరనూదినాను యియ్యకోలే సేసుకొని
వింత సేయకుండితేను వేడుక లీడేరును
(॥చెప్పి॥)
జంకించ వచ్చునా సరసము లాడే చోట
సంకెలేక వలపులు చల్లుటగాక
పంకించక చనుఁగవ పట్టి యెంత దీసినా
పొంకముగ నవ్వితేనే పొందులు చేకూరును
(॥చెప్పి॥)
సిగ్గువడవచ్చునా చేరి కాఁగిలించుకొంటే
వొగ్గి రతులకు లోనైవుండుటగాక
అగ్గమై శ్రీవేంకటేశుఁ డలయఁగ నిన్నుఁగూడె
వెగ్గళించకుండితేనే వెలయు సోబనము
(||pallavi||)
sĕppidi baddulu nenu sĕliya nīgu
yĕppaḍū maṟavaguve yĕḍayadu manasu
(||sĕppi||)
paṁtamāḍavachchunā paḍam̐tigi maganido
sĕṁtanuṁḍi yichchagame seyuḍagāga
yĕṁta goranūdinānu yiyyagole sesugŏni
viṁta seyaguṁḍidenu veḍuga līḍerunu
(||sĕppi||)
jaṁkiṁcha vachchunā sarasamu lāḍe soḍa
saṁkĕlega valabulu salluḍagāga
paṁkiṁchaga sanum̐gava paṭṭi yĕṁta dīsinā
pŏṁkamuga navvidene pŏṁdulu segūrunu
(||sĕppi||)
sigguvaḍavachchunā seri kām̐giliṁchugŏṁṭe
vŏggi radulagu lonaivuṁḍuḍagāga
aggamai śhrīveṁkaḍeśhum̐ ḍalayam̐ga ninnum̐gūḍĕ
vĕggaḽiṁchaguṁḍidene vĕlayu sobanamu