చెప్పితేఁ దెచ్చేముగాక చెలి నెవ్వతెనైనా
(॥పల్లవి॥)
చెప్పితేఁ దెచ్చేముగాక చెలి నెవ్వతెనైనా
వొప్పుగొని పైఁడికత వూఁకొనేదెట్టే
(॥చెప్ప॥)
నివ్వటిల్లఁ దనలోనే నిట్టూర్పు నిగిడించీ
యెవ్వరిపై మోహమౌతా నెట్టు దెలుసు
జవ్వనపుతనమేను జలజలఁ జెమరించీ
వువ్విళ్లూర నేఁటికని వూహించేమే
(॥చెప్ప॥)
చెక్కిటఁ జేయివెట్టుక చింతించీఁ దనుఁ దానె
యెక్కడ నున్నదో చిత్తమేమిసేతమే
పక్కన నవ్వులు నవ్వి పలుదిక్కులునుఁ జూచీ
అక్కర నేసుద్దులని యడుగఁగవచ్చునే
(॥చెప్ప॥)
వింతవింతకళలెల్ల వెస నెమ్మోమున నిండె
యెంతసంతోసమో గుఱు తెట్టు వెట్టేమే
ఇంతటిశ్రీవేంకటేశుఁడే నలమేలుమంగను
పొంతనుండి నన్నుఁ గూడె పొగడేదేమే
(||pallavi||)
sĕppidem̐ dĕchchemugāga sĕli nĕvvadĕnainā
vŏppugŏni paim̐ḍigada vūm̐kŏnedĕṭṭe
(||sĕppa||)
nivvaḍillam̐ danalone niṭṭūrbu nigiḍiṁchī
yĕvvaribai mohamaudā nĕṭṭu dĕlusu
javvanabudanamenu jalajalam̐ jĕmariṁchī
vuvviḽlūra nem̐ṭigani vūhiṁcheme
(||sĕppa||)
sĕkkiḍam̐ jeyivĕṭṭuga siṁtiṁchīm̐ danum̐ dānĕ
yĕkkaḍa nunnado sittamemisedame
pakkana navvulu navvi paludikkulunum̐ jūsī
akkara nesuddulani yaḍugam̐gavachchune
(||sĕppa||)
viṁtaviṁtagaḽalĕlla vĕsa nĕmmomuna niṁḍĕ
yĕṁtasaṁtosamo guṟu tĕṭṭu vĕṭṭeme
iṁtaḍiśhrīveṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
pŏṁtanuṁḍi nannum̐ gūḍĕ pŏgaḍedeme