Seppide nishtooramu seliya neevaaramu

చెప్పితే నిష్టూరము చెలియ నీవారము
Language

(॥పల్లవి॥)
చెప్పితే నిష్టూరము చెలియ నీవారము
రెప్పల నీలోని చూపే రేసుదెచ్చుఁ జుమ్మీ

(॥॥)
కామించి యతఁడు గారవించి పిలువఁగ
యేమన్నా బలుకవు యేలే ఇంత
దీమస మెంత నీకుఁ దీర దెంతైనాఁ బరాకు
వాములైన వలపులు వడ్డివారుఁజుమ్మీ

(॥॥)
అదన నీయింటికి నాతఁడే రాఁగా నీ-
వెదురయి మొక్కవు యేలే ఇంత
పెదవు లెత్తవు నీకు ప్రేమైనాఁ గైకోవు
కదలుఁగుచాలు నీకే కడువాండౌఁ జుమ్మీ

(॥॥)
చెంత నిట్టె కూడెను శ్రీ వేంకటేశుఁడు
యింతలో మేమఱచేవు యేలే యింత
చింతలెల్లాఁ దీరెను సేసకొప్పు జారెను
పంతములాడఁగఁబోతేపై వచ్చుఁ జుమ్మీ

(||pallavi||)
sĕppide niṣhṭūramu sĕliya nīvāramu
rĕppala nīloni sūbe resudĕchchum̐ jummī

(||||)
kāmiṁchi yadam̐ḍu gāraviṁchi piluvam̐ga
yemannā balugavu yele iṁta
dīmasa mĕṁta nīgum̐ dīra dĕṁtainām̐ barāgu
vāmulaina valabulu vaḍḍivārum̐jummī

(||||)
adana nīyiṁṭigi nādam̐ḍe rām̐gā nī-
vĕdurayi mŏkkavu yele iṁta
pĕdavu lĕttavu nīgu premainām̐ gaigovu
kadalum̐gusālu nīge kaḍuvāṁḍaum̐ jummī

(||||)
sĕṁta niṭṭĕ kūḍĕnu śhrī veṁkaḍeśhum̐ḍu
yiṁtalo memaṟasevu yele yiṁta
siṁtalĕllām̐ dīrĕnu sesagŏppu jārĕnu
paṁtamulāḍam̐gam̐bodebai vachchum̐ jummī