చెప్పితే నారచికత చెప్పకుండితే వెత
(॥పల్లవి॥)
చెప్పితే నారచికత చెప్పకుండితే వెత
దప్పికి నీరే మందు తలపోయఁ గదరే
(॥॥)
చిగురులోపలిచేఁగ చెప్పరే మీరు
నిగురులోపలి నిప్పు నిలుపరాదె
పగలు చీఁకటి గమ్మి పాయ దెంతైనా
తెగరానిచోట తరితీపులమందేదే
(॥॥)
ఆకాశపంచాంగము అందుకుఁ బేరేదే
రాకపోకజగడము రాఁజీనదే
వాకునిష్టూరాలు వచ్చీ వసముగా దెంతయినా
యేకచిత్తమైన మందు యెన్నఁ డిచ్చేరే
(॥॥)
వాన లేని చిత్తడికి వైపు లిఁకఁ జూచుకోరే
కానరాని గుఱుతులు కాఁడిపారెనే
ఆనుక శ్రీ వేంకటేశుఁ డంతలో విచ్చేసి కూడె
వీనుల వినేమందు వేధించె దేహము
(||pallavi||)
sĕppide nārasigada sĕppaguṁḍide vĕda
dappigi nīre maṁdu talaboyam̐ gadare
(||||)
sigurulobalisem̐ga sĕppare mīru
nigurulobali nippu nilubarādĕ
pagalu sīm̐kaḍi gammi pāya dĕṁtainā
tĕgarānisoḍa taridībulamaṁdede
(||||)
āgāśhabaṁchāṁgamu aṁdugum̐ berede
rāgabogajagaḍamu rām̐jīnade
vāguniṣhṭūrālu vachchī vasamugā dĕṁtayinā
yegasittamaina maṁdu yĕnnam̐ ḍichchere
(||||)
vāna leni sittaḍigi vaibu lim̐kam̐ jūsugore
kānarāni guṟudulu kām̐ḍibārĕne
ānuga śhrī veṁkaḍeśhum̐ ḍaṁtalo vichchesi kūḍĕ
vīnula vinemaṁdu vedhiṁchĕ dehamu