Seppi soobaraadu tana sittame yeṟumgu namtaa

చెప్పి చూపరాదు తన చిత్తమే యెఱుఁగు నంతా
Language

(॥పల్లవి॥)
చెప్పి చూపరాదు తన చిత్తమే యెఱుఁగు నంతా
యిప్పుడు నన్ను మన్నించి యేలుకొమ్మనవే

(॥॥)
చనవు గలిగితేను చలము లీడేరును
మనసు వచ్చితేను మాట లింపౌను
వినయము చూపితేను వెలయు మోహము లెల్లా
చెనక నేరిచితేను చిప్పిలుఁ దమకము

(॥॥)
చుట్టరికమైన చోట చుట్టుకొని మొగమోట
పొట్టఁ బొరుగై తేను పొందు గలుగు
నెట్టుకొన్న తరితీపు నిండించు వేడుకలు
కట్టు కొన్న వలపులు కౌఁగిటఁ జొక్కించును

(॥॥)
తనివోని కోరికలు తగులాయములు సేయు
మునుకొన్న తలపోఁత ముద మందించు
యెనలేని శ్రీ వేంకటేశుఁ డిట్టే నన్నుఁగూడె
వొనరిన ననుపులు వొడఁబాటు సేసును

(||pallavi||)
sĕppi sūbarādu tana sittame yĕṟum̐gu naṁtā
yippuḍu nannu manniṁchi yelugŏmmanave

(||||)
sanavu galigidenu salamu līḍerunu
manasu vachchidenu māḍa liṁpaunu
vinayamu sūbidenu vĕlayu mohamu lĕllā
sĕnaga nerisidenu sippilum̐ damagamu

(||||)
suṭṭarigamaina soḍa suṭṭugŏni mŏgamoḍa
pŏṭṭam̐ bŏrugai tenu pŏṁdu galugu
nĕṭṭugŏnna taridību niṁḍiṁchu veḍugalu
kaṭṭu kŏnna valabulu kaum̐giḍam̐ jŏkkiṁchunu

(||||)
tanivoni korigalu tagulāyamulu seyu
munugŏnna talabom̐ta muda maṁdiṁchu
yĕnaleni śhrī veṁkaḍeśhum̐ ḍiṭṭe nannum̐gūḍĕ
vŏnarina nanubulu vŏḍam̐bāḍu sesunu