Seppi pampavalenade seluvumdu naa voddigi

చెప్పి పంపవలెనటె చెలువుఁడు నా వొద్దికి
Language

(॥పల్లవి॥)
చెప్పి పంపవలెనటె చెలువుఁడు నా వొద్దికి
వొప్పుగొంటి రమ్మనవే వొద్దనేనా తన్నును

(॥చెప్పి॥)
మనసులే కలసితే మరి యెడమాటలేల
గొనకొన్న సంతోసానఁ గూడుటఁగాక
చనవు వెగ్గళమైతే జగడాలు మరియేల
ననిచి వేసటలేక నవ్వుట గాక

(॥చెప్పి॥)
కూరిములే కలిగితే గుణాలు వెదకనేల
నేరుపు లొండొరులపై నించుటకాక
కోరికె లేడేరితేను కొసరఁగ నిఁకనేల
మేరతోడి చేఁతలకే మెచ్చుటగాక

(॥చెప్పి॥)
చేతికి లోనైతేను సిగ్గులు వడఁగ నేల
కాతరాన రతులెల్లా గైకొంటగాక
యీతల శ్రీ వేంకటేశుఁడిదె తానే నన్నుఁ గూడె
కోతరపుఁ బ్రియములఁ బొసఁగుటగాక

(||pallavi||)
sĕppi paṁpavalĕnaḍĕ sĕluvum̐ḍu nā vŏddigi
vŏppugŏṁṭi rammanave vŏddanenā tannunu

(||sĕppi||)
manasule kalaside mari yĕḍamāḍalela
gŏnagŏnna saṁtosānam̐ gūḍuḍam̐gāga
sanavu vĕggaḽamaide jagaḍālu mariyela
nanisi vesaḍalega navvuḍa gāga

(||sĕppi||)
kūrimule kaligide guṇālu vĕdaganela
nerubu lŏṁḍŏrulabai niṁchuḍagāga
korigĕ leḍeridenu kŏsaram̐ga nim̐kanela
meradoḍi sem̐talage mĕchchuḍagāga

(||sĕppi||)
sedigi lonaidenu siggulu vaḍam̐ga nela
kādarāna radulĕllā gaigŏṁṭagāga
yīdala śhrī veṁkaḍeśhum̐ḍidĕ tāne nannum̐ gūḍĕ
kodarabum̐ briyamulam̐ bŏsam̐guḍagāga