Seppevaari buddulu sevimbettaru

చెప్పేవారి బుద్దులు చెవిఁబెట్టరు
Language

(॥పల్లవి॥)
చెప్పేవారి బుద్దులు చెవిఁబెట్టరు
దెప్పరపు టలుకలు దేరుటెట్టులమ్మా

(॥॥)
అపరాధిగాని విభుఁ డవ్వలి మోమై వుండఁగా
ఇపుడీపైతే నమ్మదు యివ్వలిమోమై
వుపమల నొకరొకరొట్లు వెట్టుకొన్నారు
తపముల నేఁడు కోరు తమపంతములను

(॥॥)
స్వతంత్రుఁడై నాతఁడు చలముతో నుండఁగాను
హితురాలు ననే గర్వమీపె కున్నది
మితి మీఱి తమలోన మేరలతో నున్నారు
ప్రతినతోఁ గలయరు భావపుఁగోపాలను

(॥॥)
నీటు శ్రీవేంకటేశుఁడు నేర్పుతోడ నుండఁగాను
పాటించి యాపెఁ బాన్పుపైనే వుండఁగా
మాటలచిలుక వోఁగా మగిడిద్దరూఁ బట్టఁగా
కోటికి నలుకదేరి కూటమబ్బెఁ గాక

(||pallavi||)
sĕppevāri buddulu sĕvim̐bĕṭṭaru
dĕpparabu ṭalugalu deruḍĕṭṭulammā

(||||)
abarādhigāni vibhum̐ ḍavvali momai vuṁḍam̐gā
ibuḍībaide nammadu yivvalimomai
vubamala nŏgarŏgarŏṭlu vĕṭṭugŏnnāru
tabamula nem̐ḍu koru tamabaṁtamulanu

(||||)
svadaṁtrum̐ḍai nādam̐ḍu salamudo nuṁḍam̐gānu
hidurālu nane garvamībĕ kunnadi
midi mīṟi tamalona meralado nunnāru
pradinadom̐ galayaru bhāvabum̐gobālanu

(||||)
nīḍu śhrīveṁkaḍeśhum̐ḍu nerbudoḍa nuṁḍam̐gānu
pāḍiṁchi yābĕm̐ bānpubaine vuṁḍam̐gā
māḍalasiluga vom̐gā magiḍiddarūm̐ baṭṭam̐gā
koḍigi nalugaderi kūḍamabbĕm̐ gāga