Seppenamtaa ne ne vumdi siggubadudu neduda

చెప్పేనంటా నే నే వుండి సిగ్గుపడుదు నెదుట
Language

(॥పల్లవి॥)
చెప్పేనంటా నే నే వుండి సిగ్గుపడుదు నెదుట
వొప్పుగ నాతనికి మీ రొగి విన్నవించరే

(॥॥)
చనవరితనమున సారెకు మాటలాడుదు
ననుపైనకతమున నవ్వుదును
వినయము నేర్తునంటా వేవేలు సేవలు సేతు
యెనలేని నా రమణుఁ డెగ్గుపట్టీఁ జుమ్మీ

(॥॥)
చిన్నదానఁ గనకనే చేఁతలెల్లాఁ జేయవత్తు
మన్నించిన కతమున మలయుదును
సన్నకు లోనైతిఁ గన సంతోసానఁ దమకింతు
యిన్ని నెఱిఁగినవాఁడు యెగ్గుపట్టీఁ జుమ్మీ

(॥॥)
పట్టపు దేవులనై పై పై బెనఁగుదును
గుట్టు తోదానఁ గనక కొంచి మొక్కుదు
యిట్టే శ్రీ వేంకటేశుఁ డే నలమేలుమంగను
యెట్టై నఁ దా నన్నుఁ గూడె నెగ్గుప ట్టీఁ జుమ్మీ

(||pallavi||)
sĕppenaṁṭā ne ne vuṁḍi siggubaḍudu nĕduḍa
vŏppuga nādanigi mī rŏgi vinnaviṁchare

(||||)
sanavaridanamuna sārĕgu māḍalāḍudu
nanubainagadamuna navvudunu
vinayamu nerdunaṁṭā vevelu sevalu sedu
yĕnaleni nā ramaṇum̐ ḍĕggubaṭṭīm̐ jummī

(||||)
sinnadānam̐ ganagane sem̐talĕllām̐ jeyavattu
manniṁchina kadamuna malayudunu
sannagu lonaidim̐ gana saṁtosānam̐ damagiṁtu
yinni nĕṟim̐ginavām̐ḍu yĕggubaṭṭīm̐ jummī

(||||)
paṭṭabu devulanai pai pai bĕnam̐gudunu
guṭṭu todānam̐ ganaga kŏṁchi mŏkkudu
yiṭṭe śhrī veṁkaḍeśhum̐ ḍe nalamelumaṁganu
yĕṭṭai nam̐ dā nannum̐ gūḍĕ nĕgguba ṭṭīm̐ jummī