చెప్పేదేమి ఇఁకను నీచిత్తము గాక
(॥పల్లవి॥)
చెప్పేదేమి ఇఁకను నీచిత్తము గాక
తప్పులెంచి నే నిన్నుఁ దడవఁగఁగలనా
(॥॥)
తూకొని మాటలెల్లాను దొంతులు వెట్టేవు గాక
ఆకెతోడ నేకతములాడవా నీవు
సాకిరిచెప్పేవారిని సన్నలేల సేసేవు
దీకొని నీ చేఁతలు నేఁ దెలుపఁగఁగలనా
(॥॥)
పాటించి నవ్వులు నవ్వి భ్రమయించె వింతేకాక
సూటిగా నాపెమొగము చూడవా నీవు
నీటున నీకన్నులలో నిద్దురేలణఁచేవు
జూటరినీమహిమలు సోదరించఁగఁగలనా
(॥॥)
వేసదారివినయాలు రాసులు వోసేవు గాక
ఆసపడి యాపెచన్ను లంటవా నీకు
లాసి శ్రీ వేంకటేశ మెల్లనె యేల చొక్కించేవు
నీసుద్దు లెన్నఁటికిని నే మఱవఁగలనా
(||pallavi||)
sĕppedemi im̐kanu nīsittamu gāga
tappulĕṁchi ne ninnum̐ daḍavam̐gam̐galanā
(||||)
tūgŏni māḍalĕllānu dŏṁtulu vĕṭṭevu gāga
āgĕdoḍa negadamulāḍavā nīvu
sāgirisĕppevārini sannalela sesevu
dīgŏni nī sem̐talu nem̐ dĕlubam̐gam̐galanā
(||||)
pāḍiṁchi navvulu navvi bhramayiṁchĕ viṁtegāga
sūḍigā nābĕmŏgamu sūḍavā nīvu
nīḍuna nīgannulalo niddurelaṇam̐sevu
jūḍarinīmahimalu sodariṁcham̐gam̐galanā
(||||)
vesadārivinayālu rāsulu vosevu gāga
āsabaḍi yābĕsannu laṁṭavā nīgu
lāsi śhrī veṁkaḍeśha mĕllanĕ yela sŏkkiṁchevu
nīsuddu lĕnnam̐ṭigini ne maṟavam̐galanā