చెప్పేదాఁకాఁ దరితీపు చేరి వింటే వేడుక
(॥పల్లవి॥)
చెప్పేదాఁకాఁ దరితీపు చేరి వింటే వేడుక
చొప్పుగా నీ కత నాకు సూచించవే చెలియ
(॥చెప్పే॥)
పసిఁడితీగెను మంచిపద్మము వికసించె
కసరక పామేల కాచుకున్నది
యెసగి మొల్ల మొగ్గలు ఇందుకె కూటమి గూడె
చెసల నీకత నాకుఁ దెలుపవే చెలియా
(॥చెప్పే॥)
కంతుబాణమున నారికడపుఁగాయలు గాచె
చెంత బోఁకబోదె యేల చెలువొందెనే
అంత సింగారదామము లందుకుఁ దోడువచ్చె
బంతినే యీకత నాతోఁ బలుకవే చెలియా
(॥చెప్పే॥)
పూవుమీఁదికొమ్మ కల్పభూజముతోఁ బెనగొనె
వావిరి మెఱుగు మొయిలు వన్నెవెట్టెను
యేవేళ శ్రీవేంకటేశు కీయలమేలుమంగ
దేవులాయ నీకతతెఱఁగేదే చెలియా
(||pallavi||)
sĕppedām̐kām̐ daridību seri viṁṭe veḍuga
sŏppugā nī kada nāgu sūsiṁchave sĕliya
(||sĕppe||)
pasim̐ḍidīgĕnu maṁchibadmamu vigasiṁchĕ
kasaraga pāmela kāsugunnadi
yĕsagi mŏlla mŏggalu iṁdugĕ kūḍami gūḍĕ
sĕsala nīgada nāgum̐ dĕlubave sĕliyā
(||sĕppe||)
kaṁtubāṇamuna nārigaḍabum̐gāyalu gāsĕ
sĕṁta bom̐kabodĕ yela sĕluvŏṁdĕne
aṁta siṁgāradāmamu laṁdugum̐ doḍuvachchĕ
baṁtine yīgada nādom̐ balugave sĕliyā
(||sĕppe||)
pūvumīm̐digŏmma kalbabhūjamudom̐ bĕnagŏnĕ
vāviri mĕṟugu mŏyilu vannĕvĕṭṭĕnu
yeveḽa śhrīveṁkaḍeśhu kīyalamelumaṁga
devulāya nīgadadĕṟam̐gede sĕliyā