చెప్పవే వినేఁ గాని సిగ్గువడక
(॥పల్లవి॥)
చెప్పవే వినేఁ గాని సిగ్గువడక
యిప్పుడు నా మగనికి నేమౌదువే నీవు
(॥చెప్ప॥)
చెంతనుండి రేఁగి రేఁగి సేసేవు విన్నపాలు
యెంత చనవరివే నీ వితనికిని
కాంతలెల్లా నుండఁగాను గద్దెపై నెక్కవచ్చేవు
యింత గద్దా చుట్టరిక మిందరిలో నీకు
(॥చెప్ప॥)
మోముచూపి మోముచూపిముచ్చటలాడవచ్చేవు
గామిడివై కతలెన్ని గరచితివే
చేముంచి తీసుకొనేవు చెవిలో తట్టు పుణుఁగు
యేమే యీ సలిగెలు యెందుఁ దెచ్చుకొంటివే
(॥చెప్ప॥)
సారె సారె నవ్వుతాను చన్నులనే వొరసేవు
కూరిమి నీతఁడు నిన్నుఁ గూడెనటవే
యీరీతి శ్రీవేంకటేశుఁ డీతఁడె నన్ను నేలె
నేరుపరి తనముల నీ కేడఁ గలిగెనే
(||pallavi||)
sĕppave vinem̐ gāni sigguvaḍaga
yippuḍu nā maganigi nemauduve nīvu
(||sĕppa||)
sĕṁtanuṁḍi rem̐gi rem̐gi sesevu vinnabālu
yĕṁta sanavarive nī vidanigini
kāṁtalĕllā nuṁḍam̐gānu gaddĕbai nĕkkavachchevu
yiṁta gaddā suṭṭariga miṁdarilo nīgu
(||sĕppa||)
momusūbi momusūbimuchchaḍalāḍavachchevu
gāmiḍivai kadalĕnni garasidive
semuṁchi tīsugŏnevu sĕvilo taṭṭu puṇum̐gu
yeme yī saligĕlu yĕṁdum̐ dĕchchugŏṁṭive
(||sĕppa||)
sārĕ sārĕ navvudānu sannulane vŏrasevu
kūrimi nīdam̐ḍu ninnum̐ gūḍĕnaḍave
yīrīdi śhrīveṁkaḍeśhum̐ ḍīdam̐ḍĕ nannu nelĕ
nerubari tanamula nī keḍam̐ galigĕne