Seppave neeve buddi siggayyee naagu

చెప్పవే నీవే బుద్ది సిగ్గయ్యీ నాకు
Language

(॥పల్లవి॥)
చెప్పవే నీవే బుద్ది సిగ్గయ్యీ నాకు
చిప్పిలీ వలపులెల్ల చిత్తములో నాకు

(॥చెప్ప॥)
మాటలఁ దేనెలు గారీ మచ్చికల నోరూరీ
యీటువెట్టి యీతఁ డివి యేడ నేర్చునే
కోటిసేయ నవ్వు నవ్వీ కొంగువట్టి పెనఁగీని
గాఁటపువిభునితో నేఁ గమ్మటి నేమందునే

(॥చెప్ప॥)
పిలుపులఁ దమి నిండీ ప్రియములఁ బంట వండీ
చలమరి యెటువంటిజాణఁడే తాను
తలపోఁత గడురేఁచీ దప్పిదీర మోవిఇచ్చీ
బలిమికాఁ డితనితో పంతమెట్టాడుదువే

(॥చెప్ప॥)
కన్నుల సన్నలు చూపీ కాఁగిట నాసలు రేఁపీ
పన్ని ఇన్నిటాఁ దాను పంతగాఁడౌనే
యెన్నఁగ శ్రీవేంకటేశుఁ డే నలమేలుమంగను
నన్నుఁ గూడె యెప్పుడు నాకే మోహించునే

(||pallavi||)
sĕppave nīve buddi siggayyī nāgu
sippilī valabulĕlla sittamulo nāgu

(||sĕppa||)
māḍalam̐ denĕlu gārī machchigala norūrī
yīḍuvĕṭṭi yīdam̐ ḍivi yeḍa nersune
koḍiseya navvu navvī kŏṁguvaṭṭi pĕnam̐gīni
gām̐ṭabuvibhunido nem̐ gammaḍi nemaṁdune

(||sĕppa||)
pilubulam̐ dami niṁḍī priyamulam̐ baṁṭa vaṁḍī
salamari yĕḍuvaṁṭijāṇam̐ḍe tānu
talabom̐ta gaḍurem̐sī dappidīra moviichchī
balimigām̐ ḍidanido paṁtamĕṭṭāḍuduve

(||sĕppa||)
kannula sannalu sūbī kām̐giḍa nāsalu rem̐pī
panni inniḍām̐ dānu paṁtagām̐ḍaune
yĕnnam̐ga śhrīveṁkaḍeśhum̐ ḍe nalamelumaṁganu
nannum̐ gūḍĕ yĕppuḍu nāge mohiṁchune