చెప్పవే నన్ను మన్నించి శ్రీపతి నాకు
(॥పల్లవి॥)
చెప్పవే నన్ను మన్నించి శ్రీపతి నాకు
యెప్పుడును జింతించే నిదే పనై నేను
(॥చెప్ప॥)
పొలసి నీరూప మెట్టు పొడచూపేవో
యెలమి నాభాగ్య మిఁక నెట్టున్నదో
అలరి నా కేబుద్ధి ఆనతిచ్చేవో
కలిగిన నీమాయ యేగతిఁ గడచేనో
(॥చెప్ప॥)
వరుస నా కెట్లాఁ గైవసమయ్యేనో
యిరవై నాజన్మఫల మెట్టున్నదో
పరగ నామతి నెట్టు పాయకుండేవో
కరుణానిధివి నిన్నే కరణి మెప్పించేనో
(॥చెప్ప॥)
పనివడి యెట్లా నీభక్తి యిచ్చేవో నా-
మనసు చంచల మెట్టు మట్టుపడీనో
యెనలేని నాతలఁపు యెఱిఁగి శ్రీవేంకటేశ
నను నేలితివి యెట్లా నాకోరిక చెల్లీనో
(||pallavi||)
sĕppave nannu manniṁchi śhrībadi nāgu
yĕppuḍunu jiṁtiṁche nide panai nenu
(||sĕppa||)
pŏlasi nīrūba mĕṭṭu pŏḍasūbevo
yĕlami nābhāgya mim̐ka nĕṭṭunnado
alari nā kebuddhi ānadichchevo
kaligina nīmāya yegadim̐ gaḍaseno
(||sĕppa||)
varusa nā kĕṭlām̐ gaivasamayyeno
yiravai nājanmaphala mĕṭṭunnado
paraga nāmadi nĕṭṭu pāyaguṁḍevo
karuṇānidhivi ninne karaṇi mĕppiṁcheno
(||sĕppa||)
panivaḍi yĕṭlā nībhakti yichchevo nā-
manasu saṁchala mĕṭṭu maṭṭubaḍīno
yĕnaleni nādalam̐pu yĕṟim̐gi śhrīveṁkaḍeśha
nanu nelidivi yĕṭlā nāgoriga sĕllīno