Seppavayyaa aa suddulu sevulabamdugagaanu

చెప్పవయ్యా ఆ సుద్దులు చెవులపండుగగాను
Language

(॥పల్లవి॥)
చెప్పవయ్యా ఆ సుద్దులు చెవులపండుగగాను
యిప్పు డివి యాడుకొనే రిందరూ నిజమా

(॥చెప॥)
కప్పురము నీకా కె కానికగా నిచ్చెనా
దప్పి దేరెనా నేఁడు దానివంకను
కప్పెనా తనపయ్యద గక్కన నీమీఁదను
అప్పుడు చలివాసెనా అందువల్ల నీకు

(॥చెప॥)
నీ సిరసుకెత్తుగా నెలఁత తొడ చాఁచెనా
ఆసలు ఫలించెనా అందువంకను
లాసి పాదాలొత్తెనా లలి నీతొడలు సోఁక
రాసికెక్కి నీవపుడు రతిఁ గరఁగితివా

(॥చెప॥)
చనుఁగవ దాఁక నీతో సరసానఁ బెనఁగెనా
వినయపుమాటల వేడుఁకొంటివా
తనర శ్రీ వెంకటేశ దక్కె నీకలమేల్ మంగ
నను నేలితివి దయ నాపై నీకుఁ బుట్టెనా

(||pallavi||)
sĕppavayyā ā suddulu sĕvulabaṁḍugagānu
yippu ḍivi yāḍugŏne riṁdarū nijamā

(||sĕba||)
kappuramu nīgā kĕ kānigagā nichchĕnā
dappi derĕnā nem̐ḍu dānivaṁkanu
kappĕnā tanabayyada gakkana nīmīm̐danu
appuḍu salivāsĕnā aṁduvalla nīgu

(||sĕba||)
nī sirasugĕttugā nĕlam̐ta tŏḍa sām̐sĕnā
āsalu phaliṁchĕnā aṁduvaṁkanu
lāsi pādālŏttĕnā lali nīdŏḍalu som̐ka
rāsigĕkki nīvabuḍu radim̐ garam̐gidivā

(||sĕba||)
sanum̐gava dām̐ka nīdo sarasānam̐ bĕnam̐gĕnā
vinayabumāḍala veḍum̐kŏṁṭivā
tanara śhrī vĕṁkaḍeśha dakkĕ nīgalamel maṁga
nanu nelidivi daya nābai nīgum̐ buṭṭĕnā