చెప్పవయ్య వినేను చెవులపండుగగాను
(॥పల్లవి॥)
చెప్పవయ్య వినేను చెవులపండుగగాను
వొప్పుగా నీవు లెస్స వుండుటే నా లాభము
(॥చెప్ప॥)
అలుకదేరి నీతో నాపె మాటలాడెనా
కళలు మించీ నీచక్కనిమొగము
చలములు మాని నీతో సరసములాడెనా
చెలరేఁగి వేడుకతో జిగిమించే విపుడు
(॥చెప్ప॥)
జంకించక యట్టె నీతో సారెసారె నవ్వెనా
పొంకపునీబుజము లుబ్బుచునున్నవి
మంకు దలఁచక నీ మనసురాఁ గూడేనా
అంకెల సంతోసాన నలరేవు నీవు
(॥చెప్ప॥)
పెట్టుకొన్నవొట్టెంచక ప్రేమతో మోవిచ్చెనా
మెట్టుక రతిచిన్నలు మేన నున్నవి
యిట్టె శ్రీవేంకటేశ యే నలమేలు మంగను
గట్టిగా నన్నేలితివి కలిగె నానందము
(||pallavi||)
sĕppavayya vinenu sĕvulabaṁḍugagānu
vŏppugā nīvu lĕssa vuṁḍuḍe nā lābhamu
(||sĕppa||)
alugaderi nīdo nābĕ māḍalāḍĕnā
kaḽalu miṁchī nīsakkanimŏgamu
salamulu māni nīdo sarasamulāḍĕnā
sĕlarem̐gi veḍugado jigimiṁche vibuḍu
(||sĕppa||)
jaṁkiṁchaga yaṭṭĕ nīdo sārĕsārĕ navvĕnā
pŏṁkabunībujamu lubbusununnavi
maṁku dalam̐saga nī manasurām̐ gūḍenā
aṁkĕla saṁtosāna nalarevu nīvu
(||sĕppa||)
pĕṭṭugŏnnavŏṭṭĕṁchaga premado movichchĕnā
mĕṭṭuga radisinnalu mena nunnavi
yiṭṭĕ śhrīveṁkaḍeśha ye nalamelu maṁganu
gaṭṭigā nannelidivi kaligĕ nānaṁdamu