చెప్పవయ్య వినేఁగాని చెవుల పండుగగాను
(॥పల్లవి॥)
చెప్పవయ్య వినేఁగాని చెవుల పండుగగాను
యిప్పుడే మొక్కులు మొక్కీ నెంత చుట్టరికవెూ
(॥॥)
కొమ్మ గేఁదగి రేకులు కొప్పున జెరుగు కొని
యెమ్మెలు పచరించీ నీయెదుట వదె
నెమ్మది వద్ద గూచుండి నీతో మాటలాడీని
యిమ్ముల మీకిద్దరికి నెంత చుట్టకిరమో
(॥॥)
సింగారించుకొని వచ్చి చీరునవ్వు నవ్వుకొంటా
కొంగు నిన్ను దాఁకించి కొసరీనదె
సంగతిగా నప్పటిని సారె విడెమిచ్చుకొంటా-
నెంగిలిపొత్తు గలసీ నెంతచుట్టరికమో
(॥॥)
ఆదిగొని కంకణాలు అట్టె గల్లుగల్లనఁగా
పాదాలు గుద్దీ నీకు పాన్పుపై నిదె
పొదితో శ్రీవేంకటేశ పొంచి నన్నుఁ గూడితివి
యీదెసఁ దనకు నీకు నెంతచుట్టరికమో
(||pallavi||)
sĕppavayya vinem̐gāni sĕvula paṁḍugagānu
yippuḍe mŏkkulu mŏkkī nĕṁta suṭṭarigavĕూ
(||||)
kŏmma gem̐dagi regulu kŏppuna jĕrugu kŏni
yĕmmĕlu pasariṁchī nīyĕduḍa vadĕ
nĕmmadi vadda gūsuṁḍi nīdo māḍalāḍīni
yimmula mīgiddarigi nĕṁta suṭṭagiramo
(||||)
siṁgāriṁchugŏni vachchi sīrunavvu navvugŏṁṭā
kŏṁgu ninnu dām̐kiṁchi kŏsarīnadĕ
saṁgadigā nappaḍini sārĕ viḍĕmichchugŏṁṭā-
nĕṁgilibŏttu galasī nĕṁtasuṭṭarigamo
(||||)
ādigŏni kaṁkaṇālu aṭṭĕ gallugallanam̐gā
pādālu guddī nīgu pānpubai nidĕ
pŏdido śhrīveṁkaḍeśha pŏṁchi nannum̐ gūḍidivi
yīdĕsam̐ danagu nīgu nĕṁtasuṭṭarigamo