Seppavayya nemu gomta sevula vinemugaani

చెప్పవయ్య నేము గొంత చెవుల వినేముగాని
Language

(॥పల్లవి॥)
చెప్పవయ్య నేము గొంత చెవుల వినేముగాని
చొప్పుల నీ సంతోసము చూడ వేడుకయ్యీని

(॥చెప్ప॥)
తలఁపులో నెవ్వతెను తలఁచుకొంటివొ కాని
చెలరేఁగి నీమోవి చెంగలించెను
పలుమారు నేమేమి భావించుకొంటివో
సెలవుల నీకు నిట్టె చిరునవ్వు వచ్చెను

(॥చెప్ప॥)
యెకతాన నెవ్వతె నిన్నే సేఁత చేసెనోకాని
దాకొని సిగ్గులు నీకు తరచాయను
మైకొని యప్పటి నీమన సెందెందుఁ బారెనో
ఆకుమడిచి పట్టుక అట్టె వున్నాఁడవు

(॥చెప॥)
అవ్వల నెవ్వతెమీఁది ఆస వున్నదో కాని
నివ్వటిల్లుఁదమకము నిండుకొనెను
రవ్వల శ్రీవేంకటేశ రతి నలమేల్మంగను
చివ్వల నన్నేలితివి చెమటలు మించెను

(||pallavi||)
sĕppavayya nemu gŏṁta sĕvula vinemugāni
sŏppula nī saṁtosamu sūḍa veḍugayyīni

(||sĕppa||)
talam̐pulo nĕvvadĕnu talam̐sugŏṁṭivŏ kāni
sĕlarem̐gi nīmovi sĕṁgaliṁchĕnu
palumāru nememi bhāviṁchugŏṁṭivo
sĕlavula nīgu niṭṭĕ sirunavvu vachchĕnu

(||sĕppa||)
yĕgadāna nĕvvadĕ ninne sem̐ta sesĕnogāni
dāgŏni siggulu nīgu tarasāyanu
maigŏni yappaḍi nīmana sĕṁdĕṁdum̐ bārĕno
āgumaḍisi paṭṭuga aṭṭĕ vunnām̐ḍavu

(||sĕba||)
avvala nĕvvadĕmīm̐di āsa vunnado kāni
nivvaḍillum̐damagamu niṁḍugŏnĕnu
ravvala śhrīveṁkaḍeśha radi nalamelmaṁganu
sivvala nannelidivi sĕmaḍalu miṁchĕnu