చెప్పవయ్య నాతోడను చెలి నీకెంత చుట్టమో
(॥పల్లవి॥)
చెప్పవయ్య నాతోడను చెలి నీకెంత చుట్టమో
తెప్పల భూపతిచెర్వు తిరువెంగళప్పఁడా
(॥చప్ప॥)
ముంచి తేనెలుగారేమోవినే మాటలాడీని
అంచగమన యెవ్వతో అదె నీతోను
చంచుల కనుఁదమ్ముల సారె సన్నలు సేసీని
యెంచరానివేడుకతో యిదె నీతోను
(॥చప్ప॥)
చిప్పిలఁగ నోరూర సెలవుల నవ్వు నవ్వీ
అప్పటిని నే డెవ్వతో అదె నీతోను
వొప్పుగ శిరసు వంచి వూరే సిగ్గులువడీ
యిప్పు డిందరుఁ జూడఁగ యిదె నీతోను
(॥చప్ప॥)
మొగిఁ జిమ్మిరేఁగ చన్నుమొనల మోహము చల్లీ
అగడుగ నెవ్వతో అదె నీతోను
జిగి నన్నుఁ గూడితివి శ్రీవేంకటేశుఁడ
చిగిరించ మొక్కి మచ్చీ నిదె నీతోను
(||pallavi||)
sĕppavayya nādoḍanu sĕli nīgĕṁta suṭṭamo
tĕppala bhūbadisĕrvu tiruvĕṁgaḽappam̐ḍā
(||sappa||)
muṁchi tenĕlugāremovine māḍalāḍīni
aṁchagamana yĕvvado adĕ nīdonu
saṁchula kanum̐dammula sārĕ sannalu sesīni
yĕṁcharāniveḍugado yidĕ nīdonu
(||sappa||)
sippilam̐ga norūra sĕlavula navvu navvī
appaḍini ne ḍĕvvado adĕ nīdonu
vŏppuga śhirasu vaṁchi vūre sigguluvaḍī
yippu ḍiṁdarum̐ jūḍam̐ga yidĕ nīdonu
(||sappa||)
mŏgim̐ jimmirem̐ga sannumŏnala mohamu sallī
agaḍuga nĕvvado adĕ nīdonu
jigi nannum̐ gūḍidivi śhrīveṁkaḍeśhum̐ḍa
sigiriṁcha mŏkki machchī nidĕ nīdonu