చెప్పవమ్మ నిన్నుఁ జూచి చిత్తము నివ్వెఱఁగాయ
(॥పల్లవి॥)
చెప్పవమ్మ నిన్నుఁ జూచి చిత్తము నివ్వెఱఁగాయ
చొప్పులు రెంటికి వచ్చుఁ జూచిన చెలులకూ
(॥॥)
చెక్కుల జవ్వాది గారీ చెమటలు మేన నూరీ
ముక్కున నిట్టూరుపు ముంచీ నిదేమే
గక్కన నీ చన్నులపై గందపుఁ బేట్లు రాలె
నక్కజపు రతియో ఆతనిపై యలుకో
(॥॥)
పువ్వులకొప్ప చెదరె పొందుల సందులదరె
నివ్వటిల్లు దువ్వటము నెరివిరిగే
అవ్వల నివ్వలయై హారములు దడఁబడే
నవ్వితివో పతిమాట నాఁటఁ బెనఁగితివో
(॥॥)
చుక్కలు మోవిఁ బొడమె చూపులుఁ గెంపుదడమె
కిక్కిరించిన కళలు గిజ్జిడిగొనె
యిక్కువ శ్రీ వేంకటేశుఁడింతలో విచ్చేసి కూడే
మిక్కుటపు సరసమో మెలఁగిన సిగ్గులో
(||pallavi||)
sĕppavamma ninnum̐ jūsi sittamu nivvĕṟam̐gāya
sŏppulu rĕṁṭigi vachchum̐ jūsina sĕlulagū
(||||)
sĕkkula javvādi gārī sĕmaḍalu mena nūrī
mukkuna niṭṭūrubu muṁchī nideme
gakkana nī sannulabai gaṁdabum̐ beṭlu rālĕ
nakkajabu radiyo ādanibai yalugo
(||||)
puvvulagŏppa sĕdarĕ pŏṁdula saṁduladarĕ
nivvaḍillu duvvaḍamu nĕrivirige
avvala nivvalayai hāramulu daḍam̐baḍe
navvidivo padimāḍa nām̐ṭam̐ bĕnam̐gidivo
(||||)
sukkalu movim̐ bŏḍamĕ sūbulum̐ gĕṁpudaḍamĕ
kikkiriṁchina kaḽalu gijjiḍigŏnĕ
yikkuva śhrī veṁkaḍeśhum̐ḍiṁtalo vichchesi kūḍe
mikkuḍabu sarasamo mĕlam̐gina siggulo