చెప్పవద్దు నీ సుద్దులు చెంగట నేనుండఁగానె
(॥పల్లవి॥)
చెప్పవద్దు నీ సుద్దులు చెంగట నేనుండఁగానె
కొప్పు వట్టి తీయవా ఆ కొమ్మను నీవిపుడు
(॥చెప్ప॥)
చేరి తూఁగు మంచమూఁచే చెలియ చనుమొనలు
తారుచు బొట్టనవేలఁ దాఁకించవా
కోరి సిగ్గువడి యాపె కుంచెవేయ వచ్చితేను
సారెకుఁ బోఁకముడి జారించవా యపుడు
(॥చెప్ప॥)
వీడెమియ్య రాఁగాను వెలఁదిని సన్నచేసి
కూడఁగూడ మీఁజేతులు గోరనొత్తవా
తోడనే వొడ్డించుకుంటా దోసిటఁ బువ్వులియ్యఁగా
వేడుకనుంగరమాకెవేలఁ బెట్టవా
(॥చెప్ప॥)
కంటసరి వెట్టఁగాను కామినిఁ గాఁగిట నించి
గెంటక యాకెమోవి యెంగిలిసేయవా
యింటిలోన నన్నుఁగూడి యిదివో శ్రీ వేంకటేశ
అంటి పాదాలొత్తఁగా నీవాకెమర్మాలంటవా
(||pallavi||)
sĕppavaddu nī suddulu sĕṁgaḍa nenuṁḍam̐gānĕ
kŏppu vaṭṭi tīyavā ā kŏmmanu nīvibuḍu
(||sĕppa||)
seri tūm̐gu maṁchamūm̐se sĕliya sanumŏnalu
tārusu bŏṭṭanavelam̐ dām̐kiṁchavā
kori sigguvaḍi yābĕ kuṁchĕveya vachchidenu
sārĕgum̐ bom̐kamuḍi jāriṁchavā yabuḍu
(||sĕppa||)
vīḍĕmiyya rām̐gānu vĕlam̐dini sannasesi
kūḍam̐gūḍa mīm̐jedulu goranŏttavā
toḍane vŏḍḍiṁchuguṁṭā dosiḍam̐ buvvuliyyam̐gā
veḍuganuṁgaramāgĕvelam̐ bĕṭṭavā
(||sĕppa||)
kaṁṭasari vĕṭṭam̐gānu kāminim̐ gām̐giḍa niṁchi
gĕṁṭaga yāgĕmovi yĕṁgiliseyavā
yiṁṭilona nannum̐gūḍi yidivo śhrī veṁkaḍeśha
aṁṭi pādālŏttam̐gā nīvāgĕmarmālaṁṭavā