చెప్పవచ్చితిమి నీకు చెలగి యీమేలు సుద్ది
(॥పల్లవి॥)
చెప్పవచ్చితిమి నీకు చెలగి యీమేలు సుద్ది
తప్పదు మీకిద్దరికే తగుఁదగునయ్యా
(॥చెప్ప॥)
చిలుకపలుకులది చేరఁడేసికన్నులది
నెలఁత యొక్కతే యిది నీకే తగును
నిలువుఁగొప్పుతోడినిండుమోముకళలది
నిచుచున్న దల్లదివో నిక్కిచూడవయ్యా
(॥చెప్ప॥)
పిడికెఁడునడుమిది పిక్కటిల్లుగుబ్బలది
నీడువాలుఁజూపులది నీకే తగును
కడుఁజక్కనిది సంగతులనడపులది
పొడచూపె నల్లదివొ పొందుసేయవయ్యా
(॥చెప్ప॥)
చిగురుఁ బెదవులది చిన్నారిపాదములది
నిగనిగమేనిది నీకే తగును
నిగిడి శ్రీవేంకటేశ నీవే వచ్చికూడితివి
నగరిలో నున్న దది నన్ను మెచ్చవయ్యా
(||pallavi||)
sĕppavachchidimi nīgu sĕlagi yīmelu suddi
tappadu mīgiddarige tagum̐dagunayyā
(||sĕppa||)
silugabaluguladi seram̐ḍesigannuladi
nĕlam̐ta yŏkkade yidi nīge tagunu
niluvum̐gŏppudoḍiniṁḍumomugaḽaladi
nisusunna dalladivo nikkisūḍavayyā
(||sĕppa||)
piḍigĕm̐ḍunaḍumidi pikkaḍillugubbaladi
nīḍuvālum̐jūbuladi nīge tagunu
kaḍum̐jakkanidi saṁgadulanaḍabuladi
pŏḍasūbĕ nalladivŏ pŏṁduseyavayyā
(||sĕppa||)
sigurum̐ bĕdavuladi sinnāribādamuladi
niganigamenidi nīge tagunu
nigiḍi śhrīveṁkaḍeśha nīve vachchigūḍidivi
nagarilo nunna dadi nannu mĕchchavayyā