చెప్పరే యీమాఁటలు చెలువునికి
(॥పల్లవి॥)
చెప్పరే యీమాఁటలు చెలువునికి
అప్పసము నాకు నాకె ఆడుకొనరాదు
(॥చెప్ప॥)
కలువ నననేల కంతుని దూరఁగనేల
తలఁచితే మతిలోనఁ దా నున్నాఁడు
చిలుకఁ గసరనేల చింతపై విసుఁగ నేల
పిలిచితే నోరఁ దనపేరున్నది
(॥చెప్ప॥)
చందురుఁ దిట్టనేల వసంతుని సొలయ నేల
చెంది నా కొప్పపైఁ దన సేసలుండఁగా
నిందించనేల వెన్నెల నేరా లలులపై నేల
అందమై తన గురుతు లంగముపై నుండఁగా
(॥చెప్ప॥)
పూవులపై వెగటేల పుప్పొడి గాదన నేల
శ్రీవేంకటేశుఁడు తానే చేరి కూడఁగా
కోవిలఁ గొసరనేల గుంపించ నేల చెలుల
తావై వలపలు నాకూఁ దనకు నుండఁగను
(||pallavi||)
sĕppare yīmām̐ṭalu sĕluvunigi
appasamu nāgu nāgĕ āḍugŏnarādu
(||sĕppa||)
kaluva nananela kaṁtuni dūram̐ganela
talam̐side madilonam̐ dā nunnām̐ḍu
silugam̐ gasaranela siṁtabai visum̐ga nela
piliside noram̐ danaberunnadi
(||sĕppa||)
saṁdurum̐ diṭṭanela vasaṁtuni sŏlaya nela
sĕṁdi nā kŏppabaim̐ dana sesaluṁḍam̐gā
niṁdiṁchanela vĕnnĕla nerā lalulabai nela
aṁdamai tana gurudu laṁgamubai nuṁḍam̐gā
(||sĕppa||)
pūvulabai vĕgaḍela puppŏḍi gādana nela
śhrīveṁkaḍeśhum̐ḍu tāne seri kūḍam̐gā
kovilam̐ gŏsaranela guṁpiṁcha nela sĕlula
tāvai valabalu nāgūm̐ danagu nuṁḍam̐ganu