చెప్పరే యీ తగవు చెలులాల ఆకెకు
(॥పల్లవి॥)
చెప్పరే యీ తగవు చెలులాల ఆకెకు
కప్పీ ముద్దరాలి కేలే గయ్యాళితనమూ
(॥॥)
జవ్వనము గలిగితే సరసమాడఁగఁ జెల్లు
నవ్వ నేర్చితే మాటాడ నాయ మగునూ
రవ్వగా మొక్క నేర్చితే రతి జంకించఁగఁ దగు
దవ్వుల నేమీ నేరనిదాని కేలే పగటు
(॥॥)
వినయము గలిగితే వెస గర్వించఁగఁ జెల్లు
మనసు దెలిసితేను మచ్చిక చూప నగు
పెనఁగ నేరిచితేను బెరసి పై కొనఁ దగు
నను పెఱఁగని లలనకు నేలే పంతమూ
(॥॥)
కూరిమి గలిగితేను గుట్టుతో నుండఁగఁ దగు
మేరతో నుండ నేర్చితే మించ నగును
యీ రీతి శ్రీ వేంకటేశుఁడే నలమేలుమంగను
చేరి కూడె నిఁక నేలే చిత్తిణికిఁ దాలిమీ.
(||pallavi||)
sĕppare yī tagavu sĕlulāla āgĕgu
kappī muddarāli kele gayyāḽidanamū
(||||)
javvanamu galigide sarasamāḍam̐gam̐ jĕllu
navva nerside māḍāḍa nāya magunū
ravvagā mŏkka nerside radi jaṁkiṁcham̐gam̐ dagu
davvula nemī neranidāni kele pagaḍu
(||||)
vinayamu galigide vĕsa garviṁcham̐gam̐ jĕllu
manasu dĕlisidenu machchiga sūba nagu
pĕnam̐ga nerisidenu bĕrasi pai kŏnam̐ dagu
nanu pĕṟam̐gani lalanagu nele paṁtamū
(||||)
kūrimi galigidenu guṭṭudo nuṁḍam̐gam̐ dagu
merado nuṁḍa nerside miṁcha nagunu
yī rīdi śhrī veṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
seri kūḍĕ nim̐ka nele sittiṇigim̐ dālimī.