Seppare meerainaa buddi seluvunigi

చెప్పరే మీరైనా బుద్ది చెలువునికి
Language

(॥పల్లవి॥)
చెప్పరే మీరైనా బుద్ది చెలువునికి
ఇప్పు డెంత బుజ్జగించీ నెరవులదాననా

(॥॥)
సూటి పడఁదా నెన్ని సుద్దులు చెప్పినాను
మాటల నే నూఁకొనేనా మందెమేళాన
చోటిచ్చి తన వద్దఁ గూచుండుమని పెనఁగీని
సాటి కియ్య కొనఁగ నే సరిదాననా

(॥॥)
పూనిపట్టి తా నిట్టే పూవుల చెండియ్యవచ్చి
కానుక లందుకొనేనా కడు గర్వాన
తానే నా మొగ మెత్తి తనమోము చూడుమనీ
ఆనుకొని నాఁటఁ జూడనంత దిట్ట దాననా

(॥॥)
ఆముకొని తా నెంత ఆయములంటినాను
సాము దనతోఁ జేసీనా సరి పంతాన
యీ మేర శ్రీ వేంకటేశుఁడే నలమేలుమంగను
ప్రేమ నేలెనే మొక్కి పిల్ల వింతదాననా

(||pallavi||)
sĕppare mīrainā buddi sĕluvunigi
ippu ḍĕṁta bujjagiṁchī nĕravuladānanā

(||||)
sūḍi paḍam̐dā nĕnni suddulu sĕppinānu
māḍala ne nūm̐kŏnenā maṁdĕmeḽāna
soḍichchi tana vaddam̐ gūsuṁḍumani pĕnam̐gīni
sāḍi kiyya kŏnam̐ga ne saridānanā

(||||)
pūnibaṭṭi tā niṭṭe pūvula sĕṁḍiyyavachchi
kānuga laṁdugŏnenā kaḍu garvāna
tāne nā mŏga mĕtti tanamomu sūḍumanī
ānugŏni nām̐ṭam̐ jūḍanaṁta diṭṭa dānanā

(||||)
āmugŏni tā nĕṁta āyamulaṁṭinānu
sāmu danadom̐ jesīnā sari paṁtāna
yī mera śhrī veṁkaḍeśhum̐ḍe nalamelumaṁganu
prema nelĕne mŏkki pilla viṁtadānanā