Seppare meerainaa buddi selulaala

చెప్పరే మీరైనా బుద్ది చెలులాల
Language

(॥పల్లవి॥)
చెప్పరే మీరైనా బుద్ది చెలులాల
తప్పులేని నా గుణము తానే యెఱుఁగునే

(॥చెప్పరే॥)
చలము సాదించరాదు చప్పఁగా మాటాడరాదు
నలువంకాఁ జూచి లోలో నవ్వరాదు
కొలువులోపల నన్నుఁ గొచ్చి కొచ్చి యేలడిగీ
తలఁపులోపలిమాట తానె యెఱుఁగునే

(॥చెప్పరే॥)
మేరలు మీఱఁగరాదు మేకులు సేయఁగరాదు
కేరడములాడి తన్ను గెలువరాదు
ఆరసి నన్ను నేఁడు అంతయేల వొరసీని
తారుకాణించని మాట తానే యెఱుఁగునే

(॥చెప్పరే॥)
పగటు చూపఁగరాదు పాటిసేయ కుండరాదు
యెగసక్కేలకు నేరాలెంచఁగరాదు
నగి శ్రీవేంకటేశుఁడు నన్నుఁగూడి కాఁగిటిలో
తగులాయ నిన్నియును తానే యెఱుఁగునే

(||pallavi||)
sĕppare mīrainā buddi sĕlulāla
tappuleni nā guṇamu tāne yĕṟum̐gune

(||sĕppare||)
salamu sādiṁcharādu sappam̐gā māḍāḍarādu
naluvaṁkām̐ jūsi lolo navvarādu
kŏluvulobala nannum̐ gŏchchi kŏchchi yelaḍigī
talam̐pulobalimāḍa tānĕ yĕṟum̐gune

(||sĕppare||)
meralu mīṟam̐garādu megulu seyam̐garādu
keraḍamulāḍi tannu gĕluvarādu
ārasi nannu nem̐ḍu aṁtayela vŏrasīni
tārugāṇiṁchani māḍa tāne yĕṟum̐gune

(||sĕppare||)
pagaḍu sūbam̐garādu pāḍiseya kuṁḍarādu
yĕgasakkelagu nerālĕṁcham̐garādu
nagi śhrīveṁkaḍeśhum̐ḍu nannum̐gūḍi kām̐giḍilo
tagulāya ninniyunu tāne yĕṟum̐gune