Sepparayya voodigaalu sesemu nemu

చెప్పరయ్య వూడిగాలు సేసేము నేము
Language

(॥పల్లవి॥)
చెప్పరయ్య వూడిగాలు సేసేము నేము
చిప్పిలు మోవితేనెలు చిమ్మనేల సిగ్గులు

(॥॥)
మచ్చికలు దైవారె మదనకళలు దేరె
యిచ్చలో నిద్దరికిని యింపులు మీరె
తచ్చి సతు లాడుకొంటే తలవంచుకొననేల
పచ్చియైతి రిఁకనేల పలుమారు సిగ్గులు

(॥॥)
అంగాలఁ జెమట మించె ఆసలు లోలోఁ బొంచె
రంగుగా నిద్దరి సింగారములు ముంచె
ముంగిటిచెలులతోడ మూసి మంతనములేల
యింగిత మెఱఁగవచ్చె నిఁకనేల సిగ్గులు

(॥॥)
తలపోఁతలెల్లా దక్కె తనువులు కడుఁ జొక్కె
కలసితి రిద్దరిభోగములు నిక్కె
యెలమి శ్రీవేంకటేశ యిందరితో మఱఁగేల
యెలుఁగెత్తి నవ్వరాదా యిఁకనేల సిగ్గులు

(||pallavi||)
sĕpparayya vūḍigālu sesemu nemu
sippilu movidenĕlu simmanela siggulu

(||||)
machchigalu daivārĕ madanagaḽalu derĕ
yichchalo niddarigini yiṁpulu mīrĕ
tachchi sadu lāḍugŏṁṭe talavaṁchugŏnanela
pachchiyaidi rim̐kanela palumāru siggulu

(||||)
aṁgālam̐ jĕmaḍa miṁchĕ āsalu lolom̐ bŏṁchĕ
raṁgugā niddari siṁgāramulu muṁchĕ
muṁgiḍisĕluladoḍa mūsi maṁtanamulela
yiṁgida mĕṟam̐gavachchĕ nim̐kanela siggulu

(||||)
talabom̐talĕllā dakkĕ tanuvulu kaḍum̐ jŏkkĕ
kalasidi riddaribhogamulu nikkĕ
yĕlami śhrīveṁkaḍeśha yiṁdarido maṟam̐gela
yĕlum̐gĕtti navvarādā yim̐kanela siggulu