Sepparayya meeriddaru segoni buddulu maagu

చెప్పరయ్య మీరిద్దరు చేకొని బుద్దులు మాకు
Language

(॥పల్లవి॥)
చెప్పరయ్య మీరిద్దరు చేకొని బుద్దులు మాకు
యిప్పుడే చెలుల మెల్లా నిఁక మెచ్చవచ్చునా

(॥॥)
మంతనాన మీరిద్దరు మాటలాడుకొంటిరట
చెంతల మా కవేమైనాఁ జెప్పవచ్చునా
కాంతులతో మీ మొగాలు కళలురేగి వున్నవి
అంతరంగ మదేమైనా నడుగఁగవచ్చునా

(॥॥)
చెమ్మిరేఁగి మీరు మీరే సింగారించుకొంటిరట
సొమ్ములు మాకవేమైనాఁ జాడఁగవచ్చునా
చిమ్ముఁజెముటలు మీకుఁజెక్కులు నిండుకున్నవి
సమ్మతించి మా కిఁక సంతోసించవచ్చునా

(॥॥)
వావులు చెప్పక మీరు వరుసఁ గూడితిరట
కావించి మీ గుణాలు పొగడవచ్చునా
యీవేళ శ్రీ వేంకటేశ ఇట్టె మమ్ము నేలితిరి
వేవేలు మీకీర్తులెల్లా వెలఇంచవచ్చునా

(||pallavi||)
sĕpparayya mīriddaru segŏni buddulu māgu
yippuḍe sĕlula mĕllā nim̐ka mĕchchavachchunā

(||||)
maṁtanāna mīriddaru māḍalāḍugŏṁṭiraḍa
sĕṁtala mā kavemainām̐ jĕppavachchunā
kāṁtulado mī mŏgālu kaḽaluregi vunnavi
aṁtaraṁga mademainā naḍugam̐gavachchunā

(||||)
sĕmmirem̐gi mīru mīre siṁgāriṁchugŏṁṭiraḍa
sŏmmulu māgavemainām̐ jāḍam̐gavachchunā
simmum̐jĕmuḍalu mīgum̐jĕkkulu niṁḍugunnavi
sammadiṁchi mā kim̐ka saṁtosiṁchavachchunā

(||||)
vāvulu sĕppaga mīru varusam̐ gūḍidiraḍa
kāviṁchi mī guṇālu pŏgaḍavachchunā
yīveḽa śhrī veṁkaḍeśha iṭṭĕ mammu nelidiri
vevelu mīgīrdulĕllā vĕla̮iṁchavachchunā