Sepparamma sadulaala selula kobamulagu

చెప్పరమ్మ సతులాల చెలుల కోపములకు
Language

(॥పల్లవి॥)
చెప్పరమ్మ సతులాల చెలుల కోపములకు
తప్పు లెంచేవాఁడు మరి తనకేఁటి మాటే

(॥చెప్ప॥)
సిగ్గు వడ్డ ఆఁటదానిఁ జేకొని పచ్చి సేసేటి-
నిగ్గులమగవాఁడెపో నిండుఁ గూళ
దగ్గిర రాకుండితే తరుణుల నెల్ల నంపె
బగ్గనఁ బదరేవాఁడు పాటిగలవాఁడా

(॥చెప్ప॥)
గుట్టుతోడి ఆఁటదాని గుణ మెరఁగక సారె
ఱట్టు పట్టే వానికంటే ఱాయి మేలు
దిట్టినై మారాడకుంటే తిట్టి తిట్టించుకొనేటి-
వట్టిసటకానితోడ వసమా గెలువను

(॥చెప్ప॥)
దయదలఁచి కలయఁ దానే వచ్చినదాని-
ప్రియ మెరఁగనివాఁడే పెనుమంకు
నయ మిచ్చి శ్రీవేంకటనాథుఁ డిట్టె నన్నుఁ గూడె
జయమాయ నిఁకమీఁద సరసుఁడే కాఁడా

(||pallavi||)
sĕpparamma sadulāla sĕlula kobamulagu
tappu lĕṁchevām̐ḍu mari tanagem̐ṭi māḍe

(||sĕppa||)
siggu vaḍḍa ām̐ṭadānim̐ jegŏni pachchi seseḍi-
niggulamagavām̐ḍĕbo niṁḍum̐ gūḽa
daggira rāguṁḍide taruṇula nĕlla naṁpĕ
bagganam̐ badarevām̐ḍu pāḍigalavām̐ḍā

(||sĕppa||)
guṭṭudoḍi ām̐ṭadāni guṇa mĕram̐gaga sārĕ
ṟaṭṭu paṭṭe vānigaṁṭe ṟāyi melu
diṭṭinai mārāḍaguṁṭe tiṭṭi tiṭṭiṁchugŏneḍi-
vaṭṭisaḍagānidoḍa vasamā gĕluvanu

(||sĕppa||)
dayadalam̐si kalayam̐ dāne vachchinadāni-
priya mĕram̐ganivām̐ḍe pĕnumaṁku
naya michchi śhrīveṁkaḍanāthum̐ ḍiṭṭĕ nannum̐ gūḍĕ
jayamāya nim̐kamīm̐da sarasum̐ḍe kām̐ḍā