Sepparamma meeru buddhi selulaala

చెప్పరమ్మ మీరు బుద్ధి చెలులాల
Language

(॥పల్లవి॥)
చెప్పరమ్మ మీరు బుద్ధి చెలులాల
యిప్పటి కోపము మీఁద నిట్టె వుండీనా

(॥చెప్పరమ్మ॥)
చిగురుఁబెదవి వంచి సిగ్గులనె గొణఁగీని
వెగటునఁ బతి దన్ను వేఁడుకోఁగాను
నగుతాఁ బయ్యెదకొంగు నాథుఁడు పట్టఁ బట్టఁగ
జగడించి లోని కేఁగీ సమ్మతించ కదివో

(॥చెప్పరమ్మ॥)
సరుస నవ్వులు దీర సతి యాన లెల్లఁ బెట్టీ
బెరసి విభుఁడు దన్ను బిలువఁగను
పరిమిళము లతఁడు పైపైఁ బూయ బూయఁగ
తెరచీరఁ దుడిచీని తీసి తీసి యదివో

(॥చెప్పరమ్మ॥)
చెమట చెక్కున జార సిరసు వంచుకొనీని
సుముఖుఁడై శ్రీవెంకటేశుఁడు గూడఁగ
అమరఁ గమ్మటి నాతఁ డాయము లంట నంటఁగ
తమితోఁ దిప్పించుకొంటా తాఁ దా నేర్పీ నిదివో

(||pallavi||)
sĕpparamma mīru buddhi sĕlulāla
yippaḍi kobamu mīm̐da niṭṭĕ vuṁḍīnā

(||sĕpparamma||)
sigurum̐bĕdavi vaṁchi siggulanĕ gŏṇam̐gīni
vĕgaḍunam̐ badi dannu vem̐ḍugom̐gānu
nagudām̐ bayyĕdagŏṁgu nāthum̐ḍu paṭṭam̐ baṭṭam̐ga
jagaḍiṁchi loni kem̐gī sammadiṁcha kadivo

(||sĕpparamma||)
sarusa navvulu dīra sadi yāna lĕllam̐ bĕṭṭī
bĕrasi vibhum̐ḍu dannu biluvam̐ganu
parimiḽamu ladam̐ḍu paibaim̐ būya būyam̐ga
tĕrasīram̐ duḍisīni tīsi tīsi yadivo

(||sĕpparamma||)
sĕmaḍa sĕkkuna jāra sirasu vaṁchugŏnīni
sumukhum̐ḍai śhrīvĕṁkaḍeśhum̐ḍu gūḍam̐ga
amaram̐ gammaḍi nādam̐ ḍāyamu laṁṭa naṁṭam̐ga
tamidom̐ dippiṁchugŏṁṭā tām̐ dā nerbī nidivo