Sepparaani nerubula semtalavaamdavu neevu

చెప్పరాని నేరుపుల చేఁతలవాఁడవు నీవు
Language

(॥పల్లవి॥)
చెప్పరాని నేరుపుల చేఁతలవాఁడవు నీవు
నెప్పున నిన్నుఁ గొసర నే నెంతదానను

(॥చెప్పు॥)
నంటున నీ వడుగఁగా నావావి చెప్పితిఁగాక
యింటికి నిన్నుఁ బిలువ నెంతదానను
అంటిముట్టి సరసములాడఁగాఁబైకొంటిఁగాక
జంటలై నీతోఁ బెనఁగ సరి నెంతదానను

(॥చెప్పు॥)
నీచిత్తానఁబెట్టి మన్నించఁగా మాటాడేఁగాక
యేచి నిన్నుఁ బలికించ నెంతదానను
కాచుక నావంకఁ జూడఁగాఁ గానుకిచ్చిఁగాక
లాచి నీతోఁబొఁదు సేయ లలి నెంతదానను

(॥చెప్ప॥)
వినఁగానే వినపాలు వేమారుఁ జేసితిఁగాక
యెనసి నిన్ను నే మించ నెంతదానను
ఘనుఁడ శ్రీవేంకటేశ కాఁగిట నన్నేలితివి
పెనురతుల నిన్ను మెప్పించ నెంతదానను

(||pallavi||)
sĕpparāni nerubula sem̐talavām̐ḍavu nīvu
nĕppuna ninnum̐ gŏsara ne nĕṁtadānanu

(||sĕppu||)
naṁṭuna nī vaḍugam̐gā nāvāvi sĕppidim̐gāga
yiṁṭigi ninnum̐ biluva nĕṁtadānanu
aṁṭimuṭṭi sarasamulāḍam̐gām̐baigŏṁṭim̐gāga
jaṁṭalai nīdom̐ bĕnam̐ga sari nĕṁtadānanu

(||sĕppu||)
nīsittānam̐bĕṭṭi manniṁcham̐gā māḍāḍem̐gāga
yesi ninnum̐ baligiṁcha nĕṁtadānanu
kāsuga nāvaṁkam̐ jūḍam̐gām̐ gānugichchim̐gāga
lāsi nīdom̐bŏm̐du seya lali nĕṁtadānanu

(||sĕppa||)
vinam̐gāne vinabālu vemārum̐ jesidim̐gāga
yĕnasi ninnu ne miṁcha nĕṁtadānanu
ghanum̐ḍa śhrīveṁkaḍeśha kām̐giḍa nannelidivi
pĕnuradula ninnu mĕppiṁcha nĕṁtadānanu