Sepparaani nerubula semtalaamdivi

చెప్పరాని నేరుపుల చేఁతలాఁడివి
Language

(॥పల్లవి॥)
చెప్పరాని నేరుపుల చేఁతలాఁడివి
నెప్పున నివి యెన్నఁడు నేరుచుకొంటివే

(॥చెప్ప॥)
చేతులెత్తి మొక్కేవు చేరి కొలువుసేసేవు
యేతులకుఁ గానుకలే ఇయ్యవచ్చేవు
కాతరించి పలికేవు కడుఁదమి రేఁచేవు
యీతల నీరమణుని నెంతపొదిగేవే

(॥చెప్ప॥)
మంచిమాట లాడేవు మచ్చికలు చల్లేవు
కొంచక వద్దఁ గూచుండి కొప్పు దువ్వేవు
ఇంచుకంత నవ్వేవు ఇచ్చకమే నెరుపేవు
మంచముపై పతి నెంత మరిగించుకొనేవే

(॥చెప్ప॥)
కొచ్చికొచ్చి చూచేవు గుబ్బలనే వొత్తేవు
పచ్చిగా రతులఁ గూడి భ్రమఇంచేవు
అచ్చపుశ్రీవేంకటేశుఁ డలమేల్‌మంగవు నీకు
యిచ్చల నన్నీతఁ డేలె నిందు కెంతమెచ్చేవే

(||pallavi||)
sĕpparāni nerubula sem̐talām̐ḍivi
nĕppuna nivi yĕnnam̐ḍu nerusugŏṁṭive

(||sĕppa||)
sedulĕtti mŏkkevu seri kŏluvusesevu
yedulagum̐ gānugale iyyavachchevu
kādariṁchi paligevu kaḍum̐dami rem̐sevu
yīdala nīramaṇuni nĕṁtabŏdigeve

(||sĕppa||)
maṁchimāḍa lāḍevu machchigalu sallevu
kŏṁchaga vaddam̐ gūsuṁḍi kŏppu duvvevu
iṁchugaṁta navvevu ichchagame nĕrubevu
maṁchamubai padi nĕṁta marigiṁchugŏneve

(||sĕppa||)
kŏchchigŏchchi sūsevu gubbalane vŏttevu
pachchigā radulam̐ gūḍi bhrama̮iṁchevu
achchabuśhrīveṁkaḍeśhum̐ ḍalamel‌maṁgavu nīgu
yichchala nannīdam̐ ḍelĕ niṁdu kĕṁtamĕchcheve