Sepparaani nerubu lee selivaddane vunnavi

చెప్పరాని నేరుపు లీ చెలివద్దనే వున్నవి
Language

(॥పల్లవి॥)
చెప్పరాని నేరుపు లీ చెలివద్దనే వున్నవి
యిప్పు డెంచితే వావి నేమౌనో నీకు

(॥చెప్ప॥)
చేటఁడేసి నవ్వులు సెలవుల నుండఁగానే
మూటఁడేసిమాఁట లాడీ ముదిత నీతో
గాఁటమైన చెమటలు కాలువలుగట్టి పారీ
వాఁటముగ నెందుండి వచ్చెనో తాను

(॥చెప్ప॥)
పట్టెఁ డేసి గుబ్బలపైఁ బయ్య దుండఁగానే
పెట్టెఁడేసి సిగ్గులనుఁ బెనఁగులాడీ
నెట్టుకొన్న వేడుకతో నిట్టూర్పులు చల్లుకొంటా
గుట్టుతో నీవల పెందుఁ గూడపెట్టు కొనెనో

(॥చెప్ప॥)
బారెఁడేసి వెంట్రుకల బలుకొప్పు జారఁగానే
చేరఁడేసి కన్నులఁ జూచీ నిన్నును
కోరి యలమేలు మంగకుఁబతి శ్రీ వేంకటేశ
యీరీతి నన్నేలితివి యెట్టి పొందో తనకు

(||pallavi||)
sĕpparāni nerubu lī sĕlivaddane vunnavi
yippu ḍĕṁchide vāvi nemauno nīgu

(||sĕppa||)
seḍam̐ḍesi navvulu sĕlavula nuṁḍam̐gāne
mūḍam̐ḍesimām̐ṭa lāḍī mudida nīdo
gām̐ṭamaina sĕmaḍalu kāluvalugaṭṭi pārī
vām̐ṭamuga nĕṁduṁḍi vachchĕno tānu

(||sĕppa||)
paṭṭĕm̐ ḍesi gubbalabaim̐ bayya duṁḍam̐gāne
pĕṭṭĕm̐ḍesi siggulanum̐ bĕnam̐gulāḍī
nĕṭṭugŏnna veḍugado niṭṭūrbulu sallugŏṁṭā
guṭṭudo nīvala pĕṁdum̐ gūḍabĕṭṭu kŏnĕno

(||sĕppa||)
bārĕm̐ḍesi vĕṁṭrugala balugŏppu jāram̐gāne
seram̐ḍesi kannulam̐ jūsī ninnunu
kori yalamelu maṁgagum̐badi śhrī veṁkaḍeśha
yīrīdi nannelidivi yĕṭṭi pŏṁdo tanagu