(॥పల్లవి॥)
చెప్పరాని నీ చేఁతలు
చిప్పలీ మేనఁ జెమటలేడవిరా
(॥చెప్ప॥)
కంటిఁగా నీ కతలెల్లాఁ నాఁడె
అంటిఁగా నీవన్నట్టే
ఇంటికి వచ్చేవిప్పుడు నీ
వెంటనే వచ్చీ వెలఁది యెవ్వతెరా
(॥చెప్ప॥)
నిలిచెఁగా నీ నేరుపులు అవే
తలఁచేఁగా నేఁ దమకమున
పిలిచే వెదుటనే ప్రియుఁడవై నీకు
వలచినటువంటి వనిత యెవ్వతెరా
(॥చెప్ప॥)
వొరసెఁగా నీవుదుటుగోరు నే
బెరసేఁగా నీపెనురతిని
ఇరవై శ్రీ వెంకటేశ యేలితివి నన్ను
గరిసించి యడిగె నీకాంత యెవ్వతెరా
(||pallavi||)
sĕpparāni nī sem̐talu
sippalī menam̐ jĕmaḍaleḍavirā
(||sĕppa||)
kaṁṭim̐gā nī kadalĕllām̐ nām̐ḍĕ
aṁṭim̐gā nīvannaṭṭe
iṁṭigi vachchevippuḍu nī
vĕṁṭane vachchī vĕlam̐di yĕvvadĕrā
(||sĕppa||)
nilisĕm̐gā nī nerubulu ave
talam̐sem̐gā nem̐ damagamuna
pilise vĕduḍane priyum̐ḍavai nīgu
valasinaḍuvaṁṭi vanida yĕvvadĕrā
(||sĕppa||)
vŏrasĕm̐gā nīvuduḍugoru ne
bĕrasem̐gā nībĕnuradini
iravai śhrī vĕṁkaḍeśha yelidivi nannu
garisiṁchi yaḍigĕ nīgāṁta yĕvvadĕrā