Sepparaani mohabu selivi neevu

చెప్పరాని మోహపు చెలివి నీవు
Language

(॥పల్లవి॥)
చెప్పరాని మోహపు చెలివి నీవు
చప్పఁగా నాతని నీవు సాదించ నేఁటికే

(॥॥)
చేతిలోనె వున్నవివే సేసపాలు
కాతరించ నేఁటికే కాంతునితోను
ఆతుమలో నిండెఁగదే అడియాసలు
యేతుల నీ పంతము లింత చూప నేఁటికే

(॥॥)
యిప్పుడిప్పుడే మొలచీ నివె చన్నులూ
చొప్పు లెత్తి పతి నేల సొలసేవే
చిప్పిలే వేడుకల చిన్నదానవూ
తిప్పరాని తమితోడ దీకొనఁగ నేఁటికే

(॥॥)
పరిపాకమైన దీనిపాయము
యిరవై శ్రీ వేంకటేశు నెంత దూరేవే
యెరవులేక యిట్టే యెనసితివి
తరి తీపుతో మరి తమకించ నేఁటికే

(||pallavi||)
sĕpparāni mohabu sĕlivi nīvu
sappam̐gā nādani nīvu sādiṁcha nem̐ṭige

(||||)
sedilonĕ vunnavive sesabālu
kādariṁcha nem̐ṭige kāṁtunidonu
ādumalo niṁḍĕm̐gade aḍiyāsalu
yedula nī paṁtamu liṁta sūba nem̐ṭige

(||||)
yippuḍippuḍe mŏlasī nivĕ sannulū
sŏppu lĕtti padi nela sŏlaseve
sippile veḍugala sinnadānavū
tipparāni tamidoḍa dīgŏnam̐ga nem̐ṭige

(||||)
paribāgamaina dīnibāyamu
yiravai śhrī veṁkaḍeśhu nĕṁta dūreve
yĕravulega yiṭṭe yĕnasidivi
tari tībudo mari tamagiṁcha nem̐ṭige