చెప్పరాని మహిమల శ్రీధరా నీవు
(॥పల్లవి॥)
చెప్పరాని మహిమల శ్రీధరా నీవు
చెప్పినట్టు చేసేము శ్రీధరా
(॥చెప॥)
చేరఁ దీని నా కన్నుల శ్రీధరా నీ
జీరల మేను చూచితి శ్రీధరా
చేరువ సంతోష మబ్బె శ్రీధరా
చీరుమూరాడీఁదమి శ్రీధరా
(॥చెప॥)
చెల్లు నన్నియును నీకు శ్రీధరా నీ
చిల్లరసతులు వారే శ్రీధరా
చెల్లఁబో ఆసుద్ది విని శ్రీధరా నాకు
చిల్లులాయె వీనులెల్లా శ్రీధరా
(॥చెప॥)
సేవలు సేసేము నీకు శ్రీధరా మమ్ముఁ
జేవదేరఁ గూడితివి శ్రీధరా
చేవల్లకు రావోయి శ్రీధరా
శ్రీవేంకటాద్రిమీఁది శ్రీధరా
(||pallavi||)
sĕpparāni mahimala śhrīdharā nīvu
sĕppinaṭṭu sesemu śhrīdharā
(||sĕba||)
seram̐ dīni nā kannula śhrīdharā nī
jīrala menu sūsidi śhrīdharā
seruva saṁtoṣha mabbĕ śhrīdharā
sīrumūrāḍīm̐dami śhrīdharā
(||sĕba||)
sĕllu nanniyunu nīgu śhrīdharā nī
sillarasadulu vāre śhrīdharā
sĕllam̐bo āsuddi vini śhrīdharā nāgu
sillulāyĕ vīnulĕllā śhrīdharā
(||sĕba||)
sevalu sesemu nīgu śhrīdharā mammum̐
jevaderam̐ gūḍidivi śhrīdharā
sevallagu rāvoyi śhrīdharā
śhrīveṁkaḍādrimīm̐di śhrīdharā