Sepparaadu sooburaadu seligi neebai yaasa

చెప్పరాదు చూపురాదు చెలికి నీపై యాస
Language

(॥పల్లవి॥)
చెప్పరాదు చూపురాదు చెలికి నీపై యాస
యిప్పుడే మోహము చల్లీ యిఁకమీఁదనెట్లో

(॥చెప్ప॥)
కన్నులనే నిన్నుఁ జూచి కరఁగుతా సొలసీని
చన్నులపై నునుఁగొంగు జారఁగను
వున్నతి మాటలాడి వుస్సురంటాఁ దమకించీ
యెన్ని కలీయింతి మతినెట్టున్నవో కానీ

(॥చెప్ప॥)
యిట్టునట్టు నవ్వుకొంటానెదుట నిలుచున్నది
గుట్టున మనోరథాలు గోరుకొంటాను
తొట్టిన మదము పైపైఁ దొలకఁగాఁ జెమరించీ
యిట్టే కాంత జవ్వనమెంత సేయఁగలదో

(॥చెప్ప॥)
వచ్చి వచ్చి చెయివట్టి వడిలోనికిఁ దీసీని
విచ్చనవిడిఁ దురుము వీడఁగను
మచ్చిక శ్రీవేంకటేశ మగువఁ గూడితివిట్టె
యెచ్చినయీపె తనివి యింకానెంత గలదో

(||pallavi||)
sĕpparādu sūburādu sĕligi nībai yāsa
yippuḍe mohamu sallī yim̐kamīm̐danĕṭlo

(||sĕppa||)
kannulane ninnum̐ jūsi karam̐gudā sŏlasīni
sannulabai nunum̐gŏṁgu jāram̐ganu
vunnadi māḍalāḍi vussuraṁṭām̐ damagiṁchī
yĕnni kalīyiṁti madinĕṭṭunnavo kānī

(||sĕppa||)
yiṭṭunaṭṭu navvugŏṁṭānĕduḍa nilusunnadi
guṭṭuna manorathālu gorugŏṁṭānu
tŏṭṭina madamu paibaim̐ dŏlagam̐gām̐ jĕmariṁchī
yiṭṭe kāṁta javvanamĕṁta seyam̐galado

(||sĕppa||)
vachchi vachchi sĕyivaṭṭi vaḍilonigim̐ dīsīni
vichchanaviḍim̐ durumu vīḍam̐ganu
machchiga śhrīveṁkaḍeśha maguvam̐ gūḍidiviṭṭĕ
yĕchchinayībĕ tanivi yiṁkānĕṁta galado