చెప్పరాదు చూపరాదు చిత్తములో తమకము
(॥పల్లవి॥)
చెప్పరాదు చూపరాదు చిత్తములో తమకము
కప్పిన జవ్వనమిది గంపఁ గమ్మవచ్చునా
(॥॥)
సెలవి నవ్వఁగరాదు చేతులు చాఁచఁగరాదు
యెలమిఁ దనపొందులు యెట్టుసేతునే
బలిమిఁ బెనఁగరాదు పై గోరుసోఁకించరాదు
మొలకవలపు లెట్టు మూఁటగట్టవసమే
(॥॥)
దగ్గరఁ గూచుండకాదు తాఁకించరాదు పాదము
వెగ్గళించి నేనెట్టు వీడె మిత్తునే
సిగ్గులువడఁగరాదు చెయ్యెత్తి మొక్కఁగరాదు
వొగ్గి నా నేర్పులు వొడిఁబెట్టుకుందునా
(॥॥)
మో వెంగిలిసేయరాదు మోనాన నుండఁగరాదు
వోవరిలొ నెటువలె నూరకుందునే
శ్రీవేంకటేశుఁడు తానే చేకొని నన్నిటు గూడె
సోవలుగా రతులెల్లాఁ జొప్పులెత్తఁదగవా
(||pallavi||)
sĕpparādu sūbarādu sittamulo tamagamu
kappina javvanamidi gaṁpam̐ gammavachchunā
(||||)
sĕlavi navvam̐garādu sedulu sām̐sam̐garādu
yĕlamim̐ danabŏṁdulu yĕṭṭusedune
balimim̐ bĕnam̐garādu pai gorusom̐kiṁcharādu
mŏlagavalabu lĕṭṭu mūm̐ṭagaṭṭavasame
(||||)
daggaram̐ gūsuṁḍagādu tām̐kiṁcharādu pādamu
vĕggaḽiṁchi nenĕṭṭu vīḍĕ mittune
sigguluvaḍam̐garādu sĕyyĕtti mŏkkam̐garādu
vŏggi nā nerbulu vŏḍim̐bĕṭṭuguṁdunā
(||||)
mo vĕṁgiliseyarādu monāna nuṁḍam̐garādu
vovarilŏ nĕḍuvalĕ nūraguṁdune
śhrīveṁkaḍeśhum̐ḍu tāne segŏni nanniḍu gūḍĕ
sovalugā radulĕllām̐ jŏppulĕttam̐dagavā